Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం కొన్ని రాశుల వారికి అనుకున్న ఫలితాలు కలగనున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశులపై స్వాతి నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొందరికి సమాజంలో గౌరవం ఏర్పడనుంది. మిగతారాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) :
ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు నష్టాలు రావడంతో ఆందోళతనో ఉంటారు. ప్రమాదకర వ్యాపారాల్లో పెట్టుబడులకు దూరంగా ఉండాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) :
ఎవరి వద్ద నుంచైనా అప్పు తీసుకుంటే వెంటనే తీర్చండి. లేకుంటే కష్టాల పాలవుతారు. కొత్త పనిని ప్రారంభించాలనుకునేవారికి ఇదేమంచి సమయం. కొన్ని రంగాల వారికి అనుకోని అదృష్టం వరించనుంది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర):
స్నేహితులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. బంధువుల్లో కొందరు డబ్బు సాయం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేస్తే లాభాలు వస్తాయి. ఉద్యోగులు మాటలను అదుపులో ఉంచుకోవాలి. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) :
వ్యాపారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) :
కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) :
వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. విహార యాత్రలకు ప్లాన్ చేసే వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబంలో ఒకరికి అనారోగ్యం ఉంటుంది. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) :
జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు పెడుతారు. పెండింగ్ సమస్యలను పరిస్కరించుకుంటారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :
తండ్రి సహకారంతో వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఉద్యోగులు రిలాక్స్ గా ఉంటారు. తోటివారి సహకారం ఉంటుంది.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) :
ఉపాధి కోసం ఎదురుచూస్తున్న వారు శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులు ఆదాయం పెంచుకోవడానికి కొత్త అవకాశాలు వస్తాయి. కొందరు శత్రువులపై ఆధిపత్యం సాధిస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) :
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. విద్యార్థులు ఏదైనా కొత్త కోర్సుల్లో చేరాలనుకుంటే ఇదే మంచి సమయం. పెండింగ్ పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) :
ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. వృద్ధుల పట్ల సానుభూతి ఏర్పడుతుంది. కొత్త డబ్బును కుటుంబ సభ్యుల కోసం ఖర్చు చేస్తారు. బంధువుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) :
ఆర్థికంగా పుంజుకుంటారు. వ్యాపారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు.