https://oktelugu.com/

Horoscope : 12 ఏళ్ల తరువాత ఈ గ్రహాల కలయిక.. ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే..

ఈఏడాది ఏప్రిల్ లో సూర్యుడు, గురు గ్రహం కలవబోతున్నాయి. దీంతో మూడు రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు ఉంటాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : February 20, 2024 / 12:36 PM IST

    sun jupter

    Follow us on

    Horoscope : జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. కొన్ని గ్రహాల కలయిక తో రాశులపై ప్రభావం ఉంటుంది. ముక్యంగా సూర్యడు, గురు గ్రహం ఒక తాటిపైకి వస్తే కొన్ని రాశుల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు వస్తాయి. ఈ కలయిక 12 సంవత్సరాలకు ఒకసారి ఉంటుంది. ఈఏడాది ఏప్రిల్ లో సూర్యుడు, గురు గ్రహం కలవబోతున్నాయి. దీంతో మూడు రాశుల వారి జీవితాల్లో చాలా మార్పులు ఉంటాయి. ఈ కలయిక ఆ రాశుల వారు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇంతకీ ఆ రాశులేవో చూద్దాం..

    గురువు ప్రస్తతుం మేషరాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ లో సూర్యుడు, గురు గ్రహం కలయిక వల్ల మేష రాశి వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. మరీ ముఖ్యంగా వైవాహిక జీవితం గడిపేవారు సంతోషంగా గడుపుతారు. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. సంబంధాలు బలపడుతాయి. కుటుుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు.కొన్నాళ్ల పాటు వీరి జీవితం హాయిగా గడిపోతుంది.

    సూర్యుడు, గురు కలయిక మిథున రాశిపై ప్రభావం చూపనుంది. ఈ రాశి వారు అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కెరీర్ కు సంబంధించి ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ అవుతారు. వీరి లైఫ్ లో కూడా వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది. కుటుంబ సభ్యులందరితో కలిసి ప్రయాణాలు చేస్తారు. కుటుంబ యజమానికి సభ్యుల మద్దతు పూర్తిగా ఉంటుంది. ఉద్యోగులు, కార్యాలయాల్లో ప్రశాంతంగా కొనసాగుతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి.

    గ్రహాల కలయిక సింహ రాశిపై కూడా ఉండనుంది. ఈ కాలంలో ఈ రాశివారు ధృఢంగా ఉంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సక్సెస్ సాధిస్తారు. ప్రణాళికలు రూపొందించుకుని అందుకు అనుగుణంగా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారి ప్రయత్నాలు సఫలమవుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న అనుబంధం బలపడుతుంది. ఆదాయం పొందడానికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి.