Viral Video: నేటికీ దూర ప్రాంతాలకు వెళ్లాలంటే రైలు ప్రయాణమే దిక్కు. అయితే రైలు ప్రయాణం అంతసేపు చేయాలంటే కచ్చితంగా సీటు ఉండాలి. మరీ దూర ప్రయాణమైతే బెర్త్ దక్కాలి. లేకుంటే అంతసేపు కూర్చొని ప్రయాణం చేయాలంటే చుక్కలు కనిపిస్తాయి. అయితే మన దేశంలో చాలా వరకు రైళ్లలో ఎక్కువమంది జనరల్ టికెట్ కొని రిజర్వేషన్ బోగీల్లో ఎక్కుతారు. ఇదేమని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతారు. దక్షిణాది ప్రాంతం కంటే ఉత్తరాది ప్రాంతాల వైపు ప్రయాణించే రైళ్లల్లోనే ప్రయాణికులకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే ఇటువంటి ఇబ్బంది ఓ యువతికి ఎదురయింది. ఆ యువతి రైల్లో ఉన్న పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రైల్లో తాను ఎదుర్కొంటున్న ఇబ్బందిని తన సోదరికి వాట్సప్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ప్రాంతం ఏదో తెలియదు గాని.. ఓ యువతి పై చదువుల నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్తోంది. అప్పటివరకు తన సొంత ఊర్లోనే ఉండి చదువుకుంది. ఈ నేపథ్యంలో తను కళాశాలకు వెళ్లాల్సి రావడంతో బయలుదేరింది. అయితే అది దూర ప్రాంతం కావడంతో ఆ యువతీ సోదరి ట్రైన్ టికెట్ కోసం ట్రై చేసింది. అదృష్టవశాత్తు బెర్త్ కన్ఫర్మ్ అయింది. అయితే ఆ యువతి వెళ్లే ట్రైన్ మూడు గంటలు ఆలస్యంగా నడుస్తోంది.. తన సోదరి వల్ల బెర్త్ దొరికిందని ఆ యువతీ ఆనంద పడుకుంటూ మూడు గంటల తర్వాత వచ్చిన ట్రైన్ ఎక్కింది. ఆమె ట్రైన్ ఎక్కగానే ఆ భోగిలో కనిపించిన దృశ్యం షాక్ కు గురి చేసింది.
తనకు రైల్వే శాఖ కన్ఫర్మ్ చేసిన బెర్త్ లో ఓ కుటుంబం కూర్చుంది. వారు మాత్రమే కాదు ఇంకా చాలామంది ఆ బోగీలో అలానే కూర్చున్నారు.. ఇదేంటని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్పారు. ఆ బోగి లో కనీసం నిల్చోడానికి కూడా స్థలం లేకపోవడంతో ఆ యువతి చాలా ఇబ్బందులు పడింది. చివరికి తను కన్ఫర్మ్ చేసుకున్న బెర్త్ లో అంతకుముందు కూర్చున్న ఓ కుటుంబం కొంచెం సీటు ఇస్తే దేవుడా ఇదేం ఖర్మ అనుకుంటూ కూర్చుంది. ఈలోగా ఆ యువతి సోదరి ఫోన్ చేయడంతో విషయం మొత్తం చెప్పింది. అంతేకాదు తన బాధను వాట్సాప్ సందేశాలలో వివరించింది. బోగిలో ఉన్న పరిస్థితులను వీడియో తీసి తన సోదరికి పంపిస్తే ఆమె సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతోంది. ” మీరు కన్ఫర్మ్ చేసుకున్న బెర్త్ లో మీకు సీటు అయినా ఇచ్చారు. దానికి సంతోషించాలి” అని ఓ నెటిజన్ అన్నాడు. ” రైలు ప్రయాణం అంటే అలానే ఉంటుంది. మనం టికెట్ పెట్టి బెర్త్ కన్ఫర్మ్ చేసుకోవడం మాత్రమే కాదు..సీటు కూడా దక్కించుకునేంత తెలివితేటలు ఉండాలి” అని మరో నెటిజన్ అభిప్రాయపడ్డాడు. ” ఇంత జరుగుతున్నా అటు వైపు టీసీ రాలేదా” అని ఇంకో నెటిజన్ అమాయకంగా ప్రశ్నించాడు. కాగా, ఇప్పటికే ఈ వీడియో లక్షల్లో వ్యూస్ నమోదు చేసుకుంది
-రైల్లో సమస్యలకు ‘మదద్’ తోడు..
ఇక ఇలాంటి వారి కోసం.. ఒంటరి మహిళలు, యువతులు, పిల్లల కోసం రైల్వేశాఖ ‘మదద్’ యాప్ ను రెడీ చేసింది. ఇందులో ఎవరైనా.. ఎక్కడి నుంచి అయినా సరే తమ ఆప్తులు రైల్లో ప్రయాణిస్తుంటే వారి బాధను ఫిర్యాదుగా చేయవచ్చు. వెంటనే వచ్చే స్టేషన్ లో రైల్వే శాఖ బాధితుల చెంతకు వచ్చి మరీ వారి బాధలను తీరుస్తుంది. సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఈ కొత్త యాప్ ఎవరికీ తెలియదు. ఇప్పుడిప్పుడే అవగాహన కలుగుతోంది జనాలు. సో మీరు ‘మదద్’ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోండి.. రైలు ప్రయాణాన్ని సేఫ్ గా చేసుకోండి..
For the first time my younger sister is travelling alone by train.
Anyhow we got our ticket confirmed at the last moment and train arrived 3hrs late.
She went to her seat and it was not vacant, an uncle ji with her whole family was sitting there. pic.twitter.com/ECEbllMKXp— Potato! (@Avoid_potato) February 18, 2024