Horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల్లో అనేక మార్పులు వస్తాయి. దీంతో ఆయా రాశుల్లో జన్మించిన వారి జీవితాల్లో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. 2024 ఏడాది మార్చిలో బుధ గ్రహం మీనరాశిలో సంచరిస్తాడు. ఈ కారణంగా మూడు రాశుల వారి జీవితాల్లో అనుకోని సంఘటనలు ఎదురుకానున్నాయి. మార్పి 14 న సూర్యుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే సూర్యుడు, బుధుడు ఒకేసారి ఒకే రాశిలో ఉండడం వల్ల మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇంతకీ ఏ యే రాశుల్లో ఎలాంటి మార్పులు రానున్నాయో చూద్దాం..
సూర్యుడు, బుధ గ్రహం కలయికతో వృషభ రాశిలో మార్పలు రానున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల జీవితం ప్రశాంతంగా సాగుతుంది. కొత్త ఉద్యోగాలు కోసం ప్రయత్నించేవారు సక్సెస్ అవుతారు. ఆదాయం సమకూరుతుంది. వ్యాపారుల పెట్టుబడులు లాభిస్తాయి. వీరు చేసే కొన్ని పనుల వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని ఖర్చులు ఎదురైనా వాటిని అధిగమించి డబ్బును సేవ్ చేసుకోగలుగుతారు.
ఈ రెండు గ్రహాల కలయితో కన్యారాశిపై ప్రభావం పడనుంది. ఇంతకాలం ఈ రాశివారు ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే.. ఇప్పుడు వారికి ఉపశమనం కలుగుతుంది. డబ్బు ఆదా చేసుకునేవారికి ఇదే మంచి సమయం అవుతుంది. వ్యాపారులు ఎలాంటి పెట్టుబడులు పెట్టినా ప్రయోజనకరంగా ఉంటాయి. కొందరికి ఆకస్మిక ధన యోగం ఉంటుంది. విహార యాత్రలతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యులో సంతోషంగా జీవిస్తారు.
సూర్యుడు, బుధ గ్రహాల కారణంగా మీన రాశి వారికి లాబాల పంట చేకూరుతుంది. ఈ సమయంలో వీరికి అదృష్టం లభిస్తుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఇప్పటికే పనిచేసేవారికి ప్రోత్సాహకాలు ఉంటాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇదే మంచి సమయం.