Happy Diwali 2025 Wishes: అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగును రప్పించి దీపావళి పండుగను హిందువులు అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. ఈరోజు ప్రతి ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ఆహ్వానించి ప్రత్యేక పూజలు చేస్తారు. వ్యాపార సముదాయాల్లోనూ లక్ష్మీ పూజలు నిర్వహించి తమ వ్యాపారం బాగుండాలని కోరుకుంటారు. ఆ తర్వాత టపాసులతో సందడి చేస్తారు. దీపావళి కి ప్రత్యేకంగా నోములు నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు అంతా ఒకచోట చేరుతారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటూ.. వారి ఆప్యాయతను పంచుకుంటారు. అయితే నేటి కాలంలో చాలామంది దూర ప్రాంతాల్లో ఉంటున్నారు. ఈ క్రమంలో ఒకరి గురించి మరొకరు మాట్లాడుతూ.. వారికి ఆన్లైన్లో దీపావళి శుభాకాంక్షలు చెప్పాలని అనుకుంటారు. అయితే ఈ శుభాకాంక్షలు మంచి కొటేషన్ తో చెప్పడం వల్ల ఎదుటివారిని ఆకట్టుకోగలుగుతారు. అలా ఆకట్టుకునే కొటేషన్స్ మీకోసం…
దీప కాంతిలా మీ చుట్టూ సంతోషం ఉండాలి.. మీ కష్టాలన్నీ కరిగిపోవాలి.. దీపావళి శుభాకాంక్షలు.
చీకటిపై వెలుగు విజయమే దీపావళి పండుగ.. ఈ వెలుగుల పండుగ మీ జీవితంలో సరికొత్త ఆశయాలను నింపాలి.. హ్యాపీ దీపావళి
సిరి సంపదల తల్లి లక్ష్మీదేవి కృపాకటాక్షాలు మీ ఇంటిపై ఉండాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు.
ఈ దీపావళి నుంచి మీకు అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలిగి మీ మీ జీవితం బాగుండాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి.
ఈ పవిత్ర దీపాల కాంతులు మీ జీవితంలోని చీకట్లను తొలగించాలని కోరుకుంటూ.. హ్యాపీ దీపావళి.
మీ జీవితంలో ఉన్న చీకటి తొలగిపోయి.. ఇకనుంచి వెలుగులు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. హ్యాపీ దీపావళి.
వెలుగుల పండుగ ఈ దీపావళి.. మీ జీవితంలో వెలుగుల ఆనందాన్ని నింపాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు.
కారు చీకట్లో దీపాల కాంతులు తరిమేసినట్లు.. ఈ పండుగ నుంచి మీ కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి.
మీ ప్రేమ ఆప్యాయత నా జీవితానికి వెలుగు.. మీ జీవితం ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా అమ్మానాన్న.. దీపావళి శుభాకాంక్షలు.
ఈ పండుగ వేళ మన బంధం మరింత బలపడాలని.. ఆనందం, ప్రేమను తీసుకురావాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి..
దీపాల కాంతులతో మీ మనసు ప్రకాశించాలి.. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ వెలుగుల పండుగ శుభాకాంక్షలు.
దీపావళి రోజున మీ హృదయంలో ప్రేమ వెలుగులు నింపాలని కోరుకుంటూ.. దీపావళి శుభాకాంక్షలు.
ప్రతి కల సహకారం కావాలని.. ఈ దీపావళి నుంచి మీ కొత్త జీవితానికి పునాది కావాలని కోరుకుంటూ.. హ్యాపీ దీపావళి.
నవ్వులు, సీట్లతో మీ దీపాల కాంతులు మీ దీపావళిని ఆనందంగా జరుపుకునేలా చేయాలని కోరుకుంటున్నా..
ఒక్కో దీపం వెలిగిస్తూ చీకట్లో పారద్రోలి.. కొత్త మార్పు తీసుకురావాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.
మీ జీవితంలో ప్రేమ, సంతోషం, ఆనందం, శ్రేయస్సు కలగాలని కోరుకుంటూ హ్యాపీ దీపావళి.
దుష్టశక్తులను పారద్రోలి.. కొత్త జీవితానికి స్వాగతం పలికే ఈ దీపాల పండుగ మీ జీవితాన్ని మార్చాలని కోరుకుంటూ దీపావళి శుభాకాంక్షలు.