Director Kodi Ramakrishna: ఇండియన్ స్క్రీన్ మీద విజువల్ వండర్స్ ను క్రియేట్ చేసిన దర్శకుడు రాజమౌళి… ఈయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధించాయి…ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఆయన ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడు… రాజమౌళి అంటేనే భారీ సెటప్ లతో పెద్ద సినిమాలను చేస్తూ గ్రాఫిక్స్ ని ఎక్కువగా వాడుకుంటూ విసువల్ వండర్స్ ను క్రియేట్ చేస్తూ ఉంటాడు… అలాంటి రాజమౌళి ఇప్పుడు చేస్తున్న సినిమాల విషయంలో కూడా చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు…
ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఇప్పుడు గ్రాఫిక్స్ అంటు టెక్నాలజీని వాడుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. కానీ 90స్ లోనే కోడి రామకృష్ణ లాంటి దర్శకుడు గ్రాఫిక్స్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ముఖ్యంగా ‘అమ్మోరు’ సినిమాల్లోని విజువల్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఆ సినిమాలు సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించడంలో గ్రాఫిక్స్ కీలక పాత్ర వహించింది… ఇక ఆ తర్వాత చేసిన దేవి, అంజి, అరుంధతి లాంటి సినిమాల్లో గ్రాఫిక్స్ ని వాడుకుని ఆయన సూపర్ సక్సెస్ లను సాధించాడు.
ఇక అలాంటి ఒక విజినరీ డైరెక్టర్ ముందు రాజమౌళి ఎందుకు పనికిరాడని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి గ్రాఫిక్స్ అందుబాటులో లేనప్పుడే ఆయన చాలా వండర్స్ క్రియేట్ చేశాడు. అలాంటి దర్శకుడు ఇప్పుడు ఇండస్ట్రీ లో లేకపోవడం దురదృష్టకరమైన విషయమనే చెప్పాలి. మొత్తానికైతే రాజమౌళిని మించిన దర్శకుడు కోడి రామకృష్ణ అంటూ గతంలో కొంతమంది సీనియర్ దర్శకులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేశారు.
మొత్తానికైతే ఇటు కమర్షియల్ సినిమాలను చేస్తు అటు గ్రాఫికల్ సినిమాలను కూడా చేస్తూ పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి హీరోతో సినిమాలను చేసిన ఘనత కూడా కోడి రామకృష్ణ కే దక్కుతోం… ఒకప్పుడు పాన్ ఇండియా రిలీజ్ లు లేవు కాబట్టి సరిపోయింది కానీ ఉండి ఉంటే మాత్రం ఆయన కూడా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎదిగేవాడు అంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…