Hanuman Jayanti 2025: సంజీవుడిగా పేరు ఉన్న హనుమంతుడు అంటే చాలామందికి ఇష్టం. అందుకే గ్రామ గ్రామాన.. ప్రతి పట్టణంలో హనుమాన్ దేవాలయం కచ్చితంగా ఉంటుంది. నిత్య పూజలు అందుకునే ఆంజనేయస్వామి కి ప్రతి ఏడాది జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా ఒక జీవికి ఒకేసారి పుట్టుక ఉంటుంది. కానీ ఆంజనేయ స్వామికి ప్రతి ఏడాది రెండు జయంతులు నిర్వహిస్తూ ఉంటారు. వీటిలో ఒకటి చిన్న జయంతి.. మరొకటి పెద్ద జయంతి అని అంటూ ఉంటారు. అసలు హనుమాన్ దేవుడికి ఇలా రెండుసార్లు జయంతి ఉత్సవాలు నిర్వహించడానికి కారణం ఏంటి? దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి?
శ్రీరామునికి ఇష్టమైన భక్తుడిగా పేరు ఉన్న ఆంజనేయ స్వామికి ప్రతి నిత్యం పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ వేసవికాలంలో ఆంజనేయ స్వామి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా భక్తులు హనుమాన్ దీక్షలు చేపడతారు. ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రముఖ ఆలయాల్లో ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
హనుమాన్ చిన్న జయంతి, పెద్ద జయంతి అని రెండు నిర్వహిస్తారు. వీటిలో చిన్న జయంతి అంటే పంచాంగం ప్రకారం చైత్ర పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించినట్లు తెలుస్తోంది. అందువల్ల ఈ రోజున చిన్న జయంతిని నిర్వహిస్తారు. 2025 సంవత్సరంలో ఏప్రిల్ 12వ తేదీన హనుమాన్ చిన్న జయంతిని నిర్వహిస్తున్నారు. ఈ చిన్న జయంతిని నిర్వహించడం వెనుక ఒక స్టోరీ ఉంది. హనుమంతుడు సూర్యుడిని చూడగానే అతడిని మింగడానికి పైకి ఎగురుతాడు. ఈ క్రమంలో దేవేంద్రుడు హనుమంతుడిని ఆపడానికి ప్రయత్నించి దాడి చేస్తాడు. దీంతో హనుమంతుడు స్పృహ కోల్పోతాడు. అయితే అయితే సూర్యుడికి కోపం రావడంతో విశ్వంలో సంక్షోభ పరిస్థితి నెలకొంటుంది. దీంతో దేవతలంతా వచ్చి హనుమంతుడికి చైత్రమాసంలో పౌర్ణమి రోజు రెండవ జన్మను అందించినట్లు తెలుస్తోంది.
అలాగే మరో రోజు కూడా హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు. అంటే వాల్మీకి రామాయణం ప్రకారం హనుమంతుడు కార్తీక మాసంలోని కృష్ణపక్షం చతుర్దశి రోజున జన్మించాడు. అంటే ఈ రోజున హనుమంతుడివి అవతార ఉత్సవంగా నిర్వహించుకుంటారు. ఈరోజు జయంతిని నిర్వహించడానికి గల కారణం ఏంటంటే సీతాదేవి హనుమంతుడి భక్తికి మిచ్చి అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. అందుకే ఇప్పటినుంచి హనుమంతుడు చిరంజీవిగా అవతారం ఎత్తుతాడు. దీంతో ఈ రోజును కూడా హనుమాన్ జయంతిని నిర్వహిస్తారు.
అయితే హనుమాన్ జయంతి రెండు ఉత్సవాలు నిర్వహించిన సందర్భంగా భక్తులు ప్రత్యేక దీక్షలు కొనసాగిస్తారు 11 రోజుల నుంచి 41 రోజుల వరకు దీక్షలు చేపట్టి ఆంజనేయ స్వామి సేవలో మునిగిపోతారు. ఆ తర్వాత కృష్ణ పక్ష చతుర్దశి రోజున దీక్షలు ముగించి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నెల రోజులపాటు హనుమాన్ ఆలయాలు ఆంజనేయస్వామి నామస్మరణతో మారుమోగుతూ ఉంటాయి. నిత్యం పూజలు నిర్వహిస్తూ భక్తులు ఆంజనేయ స్వామిని కొలుస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామికి పూజలు చేయడం వల్ల ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోతాయని భక్తులు నమ్ముతూ ఉంటారు.