https://oktelugu.com/

Horoscope Today: ఈ నాలుగు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం.. ఏ పని చేసినా విజయమే..

ఈరోజు వరలక్ష్మీ వ్రతం కారణంగా ప్రీతి యోగం ఏర్పడనుంది. అలాగే సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : August 16, 2024 / 07:50 AM IST

    Horoscope Today:

    Follow us on

    Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశులపై శుక్రవారం పూర్వాషాఢ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు ధనుస్సు రాశిలో సంచారం చేయనున్నాడు.ఈరోజు వరలక్ష్మీ వ్రతం కారణంగా ప్రీతి యోగం ఏర్పడనుంది. అలాగే సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండనుంది. మరికొన్ని రాశుల వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    ఇన్ని రోజులు ఉనన అడ్డంకులు తొలగిపోతాయి. చట్ట పరమైన కేసుల నుంచి విముక్తి కలుగుతుంది. వ్యాపారులకు పురోగతి లభిస్తుంది. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు.

    వృషభ రాశి:
    వ్యాపారులు కొత్త ప్రణాళికలు వేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు. కుటుంబంలో ఉల్లాసమైన వాతావరణం ఉంటుంది.

    మిథున రాశి:
    వ్యాపారులు కొత్త పెట్టుబుడులు పెడుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కొన్ని వాగ్వాదాలు ఉంటాయి. సంయమనం పాటించడం వల్ల సమసిపోతాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

    కర్కాటక రాశి:
    ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. కొన్ని పనుల కారణంగా ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి సలహాతో కొత్త పెట్టుబడులు పెడుతారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు కష్టపడిన దానికి ఫలితం ఉంటుంది. స్నేహితులతో సరదాగా ఉంటారు.

    సింహారాశి:
    ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి పుంజుకుంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం బహుమతిని కొనుగోలు చేస్తారు. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

    కన్య రాశి:
    చుట్టు పక్కల వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. విహార యాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేస్తారు. ఆత్మ విశ్వాసంతో పని చేయడం వల్ల విజయం సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యాల గురించి చర్చిస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    తుల రాశి:
    కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారులు అనూహ్య లాభాలు పొందుతారు. ఆస్తికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామి సలహాతో ఓ కీలక నిర్ణయం తీసుకుంటారు.

    వృశ్చిక రాశి:
    ఉద్యోగులకు అదనపు ఆదాయం ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. జీవనోపాధికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు.

    ధనస్సు రాశి:
    ఉద్యోగులు కొత్త ఆఫర్ ను పొందుతారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. బంధువుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. వ్యాపారులు కష్టాలను ఎదుర్కొంటారు. అయినా లాభాలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి.

    మకర రాశి:
    వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పెద్దల సలహాతో కీలక నిర్ణయం తీసుకుంటారు. అన్ని పనులు ఏక కాలంలో పూర్తి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారులకు లాభాలు గణనీయంగా ఉంటాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.

    కుంభరాశి:
    వ్యాపారులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. విద్యార్థులు ఉపాధ్యాయులు ఆశీస్సలు పొందుతారు. వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యే అవకాశం. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

    మీనరాశి:
    పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామితో వివాదం ఉంటే సమసిపోతుంది. ప్రయాణాలకు ప్లాన్ చేస్తారు. వ్యాపారులు కొన్ని రిస్క్ పనులు చేస్తారు. దీంతో లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. విద్యార్థుల కెరీర్ పై దృష్టి పెడుతారు.