https://oktelugu.com/

God: మొక్కులు తీర్చకపోతే దేవుడు ఆగ్రహిస్తాడా? ఇందులో నిజమెంత?

ఏ చిన్న సమస్య వచ్చిన కూడా వెంటనే దేవుడికి కానుకలు ఇస్తామని కోరుతారు. దేవుడు కోరికలు తీర్చిన వెంటనే ఆనందంలో తేలుతుంటాడు. పూర్తి ఆ కోరికలు గురించి మరిచిపోతారు. అసలు కోరికలు కోరుకున్నానా? అనే ప్రశ్న కూడా మొదలువుతుంది? మరికొందరు తర్వాత దేవుడు కోరికలను నెరవేర్చుదామని ధీమా వ్యక్తం చేస్తారు. ఇలా ఏదో విధంగా మొక్కు తీర్చుకోవడం ఆలస్యం చేస్తుంటారు. అయితే మొక్కిన మొక్కులు తీర్చకపోతే దేవుడికి కోపం వస్తుందా? మన మీద పగ పడతాడా? అసలు ఇందులో నిజమెంత? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 31, 2024 / 02:04 AM IST

    Goddess-Lakshmi

    Follow us on

    God: ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీ మనిషికి కూడా కష్టాలు అనేవి ఉంటాయి. అసలు కష్టాలు లేకుండా ఏ మనిషి ఉండడు. కాళ్లు తడవకుండా సముద్రాన్ని దాటగలడు ఏమో.. కానీ కళ్లు తడకుండా జీవితాన్ని దాటలేడనే సామెత కూడా ఉంది. అయితే మనిషికి ఏదైనా కష్టం వస్తే వెంటనే దేవుడిని ఆశ్రయిస్తాడు. తన బాధను ఎవరితో చెప్పుకోలేక.. వెంటనే దేవుడితో పంచుకుంటాడు. కోరిన కోరికలు నెరవేరితే మీకు కానుకలు ఇస్తానని మొక్కకుంటాడు. ఇలా మొక్కు కోవడం వల్ల దేవుడు తన కోరికలు తీరుస్తాడని చాలా మంది నమ్ముతారు. దీంతో ఏ చిన్న సమస్య వచ్చిన కూడా వెంటనే దేవుడికి కానుకలు ఇస్తామని కోరుతారు. దేవుడు కోరికలు తీర్చిన వెంటనే ఆనందంలో తేలుతుంటాడు. పూర్తి ఆ కోరికలు గురించి మరిచిపోతారు. అసలు కోరికలు కోరుకున్నానా? అనే ప్రశ్న కూడా మొదలవుతుంది? మరికొందరు తర్వాత దేవుడు కోరికలను నెరవేర్చుదామని ధీమా వ్యక్తం చేస్తారు. ఇలా ఏదో విధంగా మొక్కు తీర్చుకోవడం ఆలస్యం చేస్తుంటారు. అయితే మొక్కిన మొక్కులు తీర్చకపోతే దేవుడికి కోపం వస్తుందా? మన మీద పగ పడతాడా? అసలు ఇందులో నిజమెంత? అనే పూర్తి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    నిజం చెప్పాలంటే దేవుడు ప్రజల కష్టాలను తీర్చి వారిని మంచి దారిలో మాత్రమే నడిపిస్తాడు. కానీ మొక్కులు తీర్చలేదని వారిని మళ్లీ కష్టాల్లో నడిపించడు. మనం ఏదైనా పని సవ్యంగా కావాలని కోరుకుంటాం. ఏదో ఆటంకం వల్ల ఆ పని పూర్తి కాకపోతే.. దేవుడి మొక్కులు తీర్చలేదు. అందుకే మనకి ఇలా జరిగిందని భావిస్తారు. ఇది కేవలం మన అపోహ మాత్రమేనని పండితులు అంటున్నారు. దేవుడు ఎప్పుడూ కూడా పగ తీర్చుకోడు. ఇవన్నీ కూడా మనుషులు సృష్టించినవే అని పండితులు చెబుతున్నారు. మొక్కు అనేది ఒక నమ్మకం లాంటిది. భగవంతుడిపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అంతే కానీ దేవుడు శపిస్తాడని, పగ తీర్చుకుంటాడని మొక్కులు తీర్చుకోకూడదు. దేవుడు కోరికలు తీర్చుతాడనే నమ్మకంతో మొక్కావు. అదే నమ్మకంతో కోరికలు తీర్చాలి. కుదరకపోతే లేదు. అంతే కానీ దేవుడు తిరిగి పగ పెట్టుకుంటాడని అనుకోవడం మూర్ఖత్వం అని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి అపోహాలను అసలు నమ్మవద్దు. అలాగని దేవుడిపై ఉన్న నమ్మకాన్ని పొగోట్టుకోవద్దు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు మనకి అండగా ఉంటాడు. మనతో ఎవరూ లేకపోయిన దేవుడు మనకి ఏదో ఒక పాజిటివ్ వైబ్ ఇస్తాడు. ఎలాంటి సమస్యను అయిన కూడా తట్టుకుని నిలబడేలా మనలో కాన్ఫిడెన్స్ పెంచుతాడు. సమస్యలు అనేవి సహజం. మనం వాటిని ఎలా తీసుకున్నాం.. వాటి నుంచి ఎంత నేర్చుకున్నామనేది ముఖ్యమని దేవుడే మనకు కొన్ని సమస్యల వల్ల తెలుపుతాడు. కాబట్టి దేవుడు పగ పడతాడు అంటే అసలు నమ్మవద్దు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలన్నీ కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. సూచనలు, సలహాల కోసం పండితులను సంప్రదించగలరు.