Money luck zodiac signs: 2026 సంక్రాంతి సందర్భంగా వేడుకలు జరుపుకునేందుకు తెలుగు ప్రజలు సిద్ధమవుతున్నారు. దూర ప్రాంతాల నుంచి సొంత ఊళ్ళకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే మకర సంక్రాంతి సందర్భంగా సూర్యుడు దక్షిణాయామం నుంచి ఉత్తరాయానం ప్రయాణం ప్రారంభిస్తాడు. సూర్యుడు ప్రయాణంలో మార్పు ఉండడంవల్ల కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా మకర సంక్రాంతి నుంచి ఐదు రాశుల వారి జీవితాల్లో ఊహించని సంఘటనలు ఎదుర్కొనున్నాయి. ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం..
మకర సంక్రాంతి నుంచి మేష రాశి వారికి అద్భుతమైన ప్రగతి ఉండనుంది. ఈ రాశి వారు గతంలో పెట్టుబడులు పెడితే వాటినుంచి లాభాలు పొందుతారు. ఆరోగ్యంగానూ ఉండగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం కోసం మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో అధిక లాభాలు పొందుతారు. ఏ పని ప్రారంభించినా కూడా దానిని వెంటనే పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. అనుకున్న పనులను వెంటనే పూర్తి చేస్తాను.
వృషభ రాశి వారికి మకర సంక్రాంతి నుంచి అనేక ప్రయోజనాలు ఉండనున్నాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇంట్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో వ్యాపారాలు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు తోటి వారి సహకారం ఉండడంతో పాటు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ఫలితంగా అనుకున్న ముఖ్యమైన పనులు తొందరగా పూర్తి చేస్తారు. విదేశాలలో వ్యాపారం చేసేవారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన దానిని వెంటనే పూర్తి చేస్తారు.
సంక్రాంతి వేళ మకర రాశి వారికి అద్భుతమైన రోజులు రానున్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతు ఉండడంతో ఇంట్లో ప్రశాంతమైన వాతావరణ ఉంటుంది. విభేదాలు తొలగిపోతాయి. సోదరుల మమధ్యఉన్న విభేదాలు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అత్యధిక లాభాలు ఉంటాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది.
కుంభరాశి వారికి జనవరి 15 నుంచి మహార్దశ పట్టణం ఉంది. వీరికి అన్ని పనుల్లో సహకారం ఉంటుంది. అనుకోకుండా ప్రయాణాలు చేస్తే లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది.. అనుకున్న పనులను వెంటనే పూర్తి చేయగలుగుతారు. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు వస్తాయి. ఏ పని మొదలుపెట్టిన దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు.
వృశ్చిక రాశి వారికి ఆదాయ వనరులు పెరుగుతాయి. అప్పులన్నీ తీరిపోతాయి. సూర్యుడు వీరికి అనుకూలంగా ఉండడంతో సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగులకు కార్యాలయాల్లో సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్తగా వ్యాపారం పెట్టే వారికి శుభ సమయం.