Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. నవంబర్ 29న బుధవారం ద్వాదశ రాశులపై మార్గశిర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో తుల రాశివారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
సంబంధాలు మెరుగవుతాయి. మాట, ప్రవర్తన వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు ఆకస్మిక లాభాలు వస్తాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి.
వృషభం:
ఉపాధి కోసం ఎదురుచూస్తున్నవారికి ఈరోజు ఫలితం ఉంటుంది. ఏదైని పని చేసేటప్పుడు ప్రణాళిక బద్ధంగా చేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి.
మిథునం:
ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశసంలు లభిస్తాయి. వ్యాపారులకు లాభాలు వస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ప్రియమైన వారితో సన్నిహితంగా ఉంటారు.
కర్కాటకం:
కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని ప్లాన్ వేస్తారు. అనుకున్న విజయం సాధిస్తారు. కొందరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. భవిష్యత్ లో వారితో ప్రమాదాలు ఉండే అవకాశం.
సింహం:
ఉద్యోగులు తోటివారితో అంత చనువుగా ఉండాల్సిన అవసరం లేదు. అయితే కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.
కన్య:
ఈ రాశివారికి ప్రతికూల పరిస్థితులు ఉండొచ్చు. అయితే వాటిని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. సాయంత్రం ఉల్లాసంగా గడుపుతారు. ప్రియమైన వారితో సంబంధాలు మెరుగుపడుతాయి.
తుల:
తుల రాశి వారికి కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది. స్నేహితులతో కలిసి సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. సమస్య పరిష్కారానికి ఆలోచనలు చేస్తారు. రాజకీయ నాయకులైతే వారికి అనుకూల ఫలితాలు.
వృశ్చికం:
మీ చుట్టూ నెటెటివ్ ఎనర్జీ ఉండే అవకాశం. అయితే మనసులో చెడు ఆలోచనలు వచ్చినా.. వాటికి కట్టడి చేయాలి. పిల్లల నుంచి అకస్మాత్తుగా శుభవార్తలు వింటారు.
ధనస్సు:
బంధువులకు డబ్బు సాయం చేస్తారు. అయితే కొన్ని పనుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వ్యాపారులు ప్రణాళిక బద్ధంగా పెట్టుబడులు పెట్టాలి.
మకరం:
కొర్టుకేసులు పెండింగులో ఉంటే ఈరోజు పరిష్కారం అవుతాయి. కొన్ని రంగాల వారు బిజీగా గడుపుతారు. జీవితభాగస్వామి కోసం సమయాన్ని కేటాయిస్తారు.
కుంభం:
కొత్త ప్రాజెక్టు ప్రారంభించేవారికి అనుకూల సమయం. వారికి అన్ని విధాలుగా కలిసివస్తుంది. విహార యాత్రలకు ప్లాన్ వేసినా వెళ్లకుండా ఉండడమే మంచిది.
మీనం:
ఓ పని పూర్తి కావడంతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రియమైన వారి నుంచి సానుకూల సంకేతాలు వస్తాయి. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు.