Rashi Phalalu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. డిసెంబర్ 3న ఆదివారం ద్వాదశ రాశులపై అశ్లేష నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో మేషం, మిథునం రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. 12 రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.
మేషరాశి:
ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఆలోచనాత్మకంగా పనులు పూర్తి చేయాలి. కుటుంబ సభ్యుల నుంచి కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఖర్చులు పెరిగే అవకాశం.
వృషభం:
స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. అనవసర వాదనలకు దిగొద్దు. ఉపాధి కోసం ప్రయత్నించేవారికి అనుకూల సమయం. కొత్త అవకాశాలు వస్తాయి.
మిథునం:
భాగస్వామి నుంచి బహుమతిని పొందుతారు. కొత్త పెట్టుబడితే దానిని గోప్యంగా ఉంచాలి. విద్యార్థులు ఏకాగ్రతతో ఉండేవారికి అనుకూల ఫలితాలు. భవిష్యత్ గురించి ఆలోచిస్తారు.
కర్కాటకం:
ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల కోసం సమయం కేటాయిస్తారు. మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొత్త ఉత్సాహం ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో విజయం సాదిస్తారు.
సింహం:
అవివాహితులకు సంబంధాలు వచ్చే అవకాశం. కుటుంబ సభ్యల సలహా తీసుకోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి లాభాలు ఉండే అవకాశం.
కన్య:
కొన్ని ఆహారపు అలవాట్లను చేసుకోవాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. భూ వివాదాలు పరిష్కారం అవుతాయి. భవిష్యత్ లో కొన్ని శుభవార్తలు వింటారు.
తుల:
ప్రభుత్వం నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. భాగస్వామ్యంతో చేసే కొన్ని ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. రాజకీయ రంగంలో ఉండేవారికి శుభఫలితాలు.
వృశ్చికం:
విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని రంగాల్లో పురోగతి సాధిస్తారు. ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. విదేశాల్లో వ్యాపారం చేసేవారు శుభవార్తలు వింటారు.
ధనస్సు:
ఏదైనా కలహాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి. బంధువుల నుంచి గౌరవం పొందుతారు. రావాల్సిన బకాయిలు అందుతాయి. ప్రసంగంలో మాధుర్యం ఉండాలి.
మకరం:
ఉద్యోగులు కార్యాలయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వివాహనికి సంబంధించిన విషయాలపై ఎక్కువగా ఆలోచిస్తారు.
కుంభం:
వివాహ సంబంధాలు పెరుగుతాయి. ఒత్తిడికి లోను కాకుండా నిర్ణయాలు తీసుకోవాలి. కోపం కారణంగా కుటుంబ సభ్యుల మధ్య చీలికలు రావొచ్చు.
మీనం:
ముఖ్యమైన వ్యక్తుల నుంచి కొత్త సమాచారం అందుకుంటారు. కొన్ని పనులు పూర్తి కాకపోవడంతో ఆందోళన చెందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.