https://oktelugu.com/

Horoscope Today : సౌభాగ్య యోగం కారణంగా ఈ రాశుల వారికి ఈరోజు డబ్బే డబ్బు..

Horoscope Today ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు.

Written By:
  • NARESH
  • , Updated On : June 28, 2024 / 08:13 AM IST

    Horoscope

    Follow us on

    Horoscope Today: 2024 జూన్ 28 శుక్రవారం రోజున ద్వాదశ రాశులపై పూర్వభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు సౌభాగ్య యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదాయం పెరుగుతుంది. మరికొన్ని రాశుల వారికి ఖర్చులు పెరుగుతాయి.

    మేష రాశి:
    ఖర్చులు పెరుగుతాయి. వివాహితులు సంతానం గురించి శుభవార్త వింటారు. కొన్ని రంగాల వారికి అనుకోని అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులు ఒత్తిడిని ఎదుర్కొంటారు.

    వృషభ రాశి:
    వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. నాణ్యమైన ఆహారం తీసుకోవాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు.

    మిథున రాశి:
    కొన్ని రంగాల వారు బిజీగా ఉంటారు. వ్యాపారులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి.

    కర్కాటక రాశి:
    ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామితో వాగ్వాదం ఉంటుంది. విద్యార్థులు సమస్యల నుంచి బయటపడుతారు.

    సింహారాశి:
    ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామి పూర్తి మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు.

    కన్య రాశి:
    వ్యాపారులకు అనుకోని లాభాలు ఉంటాయి. సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులు కొన్ని కష్టాలు ఎదుర్కొంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    తుల రాశి:
    కుటుంబంలో సమస్యలు ఉంటాయి. కోర్టు కేసులను గెలుస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది.

    వృశ్చిక రాశి:
    వ్యాపారాభివృద్ధి పెరుగుతుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.

    ధనస్సు రాశి:
    ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొన్ని శుభవార్తలు వింటారు. భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు.

    మకర రాశి:
    ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విహార యాత్రలకు వెళ్తారు. బంధువులతో సంతోషంగా ఉంటారు. ఉద్యోగులు కొన్ని నష్టాలను ఎదుర్కొంటారు.

    కుంభరాశి:
    ఖర్చులు పెరుగుతాయి. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఆర్థిక లావాదేవీలపై అప్రమత్తంగా ఉండాలి.

    మీనరాశి:
    ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆస్తికి సంబంధించి శుభవార్త వింటారు.