Navratri 9th Day : మహిషాసుర మర్దిని అవతారంలో ఉన్న అమ్మవారికి ఎటువంటి పూజలు చేస్తారో తెలుసా?

మహిషాసురుడు అనే రాక్షసుడిని సిద్ధిదాత్రి రూపంలో సంహరించారు. అందుకే ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగానూ, సిద్ధిదాత్రిగానూ కొలుస్తారు. ఈ సందర్భంగా దుర్గాదేవి మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నాయి. అయితే ఈరోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఈరోజు అమ్మవారి అనుగ్రహం పొందడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి?

Written By: Srinivas, Updated On : October 11, 2024 1:36 pm

Navratri 9th Day

Follow us on

Navratri 9th Day : దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అక్టోబర్ 3న ప్రారంభమైన ఈ ఉత్సవాలు 12తో ముగియనున్నాయి. ఈ తరుణంలో ఆదిశక్తిగా పిలిచే పార్వతి దేవి అమ్మవారు రోజుకో అవతారంలో కనిపించి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇప్పటి వరకు 8 రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమించి భక్తులకు దీవెనలు అందించారు. అక్టోబర్ 11న మాతా దేవి మహిషాసుర మర్దిని అవతారంలో కనిపిస్తారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని సిద్ధిదాత్రి రూపంలో సంహరించారు. అందుకే ఈరోజు అమ్మవారిని మహిషాసుర మర్దినిగానూ, సిద్ధిదాత్రిగానూ కొలుస్తారు. ఈ సందర్భంగా దుర్గాదేవి మండపాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నాయి. అయితే ఈరోజు ఎలాంటి పూజలు నిర్వహిస్తారు? ఈరోజు అమ్మవారి అనుగ్రహం పొందడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి?

నవరాత్రి ఉత్సవాల్లో తొమ్మిదో రోజైన అమ్మవారు సిద్ధిదాత్రిగా కనిపిస్తారు. ఈ సందర్భంగా ఉదయం లేచి స్నానమాచరించి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఇంట్లో పూజలు నిర్వహస్తే అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలి. లేదా మండపాలకు వెళ్లేవారు అయితే పూజా సమానుతో వెళ్లాలి. ముఖ్యంగా ఈరోజు కన్య పూజలు ఎక్కువగా నిర్వహిస్తారు. 1 నుంచి 9 సంవత్సరాల లోపు వారికి భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో వారిని అలంకరించి వారిని తీర్చి దిద్దుతారు. అలాగే యువతులకు కొన్ని వంటకాలను ప్రత్యేకంగా తయారు చేసి వారికి అందిస్తారు.

అమ్మవారి రూపాల్లో చివరిది సిద్ధిదాత్రి అవతారం. అందువల్ల ఈరోజు చేసే పూజలు విశిష్టమైనదిగా భావిస్తారు. అంతేకాకుండా ఈరోజు అమ్మవారి అనుగ్రహం పొందితే కష్టాల నుంచి గట్టెక్కుతారని భావిస్తారు. ఇంట్లో అశాంతి నెలకొన్నా.. ఇప్పటి నుంచి శుభం జరుగుతందని చెబుతున్నారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. ముఖ్యంగా చదువుకునే వారికి తెలివి ఎక్కువగా పెరుగుతంది. పుస్తకాలు, విద్యాసామగ్రితో పూజలు నిర్వహించడం వల్ల అమ్మవారి సంతోషిస్తారని చెబుతారు. అలాగే ఈరోజు షోడశోపచార పూజ నిర్వహిస్తారు. దీంతో అమ్మవారి తొమ్మిది రూపాలతో ఉన్న చివరి రూపంలో భక్తులకు కావాల్సిన వరాలు అందిస్తుంది.

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈరోజు విశేషమైన పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత రోజు నవమి నాడు అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఈ సందర్భంగా అమ్మవారిని ఆయా గ్రామాలు, పట్టణాల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.వచ్చే ఏడాది వరకు తమ జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకుంటారు. అలాదే తొమ్మిది రోజుల పాటు అమ్మవారి సేవలో ఉన్న దీక్షా పరులు ఈరోజుతో దీక్షను విరమిస్తారు. మళ్లీ వచ్చే నవరాత్రి ఉత్సవాల్లో దీక్షలు స్వీకరిస్తారు.

తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పదోరోజు అమ్మవారి విగ్రహాల ముందు విజయదశమి వేడుకలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా జమ్మిచెట్టును ఇక్కడికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత దీని ఆకులతో ఒకరినొకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతారు. ఆ తరువాత రావణ దహన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాధారణంగా పదో రోజునే అమ్మవారి విగ్రహాలు నిర్వహిస్తారు. కానీ ఈసారి విజయదశమి రోజున దసరా పండుగ తరువాత అమ్మవారి విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉంది.