Navaratri 2024 : నవరాత్రులు చేస్తున్నారా.. ఎట్టిపరిస్థితుల్లో ఈ పనులు చేయవద్దు!

దేవి నవరాత్రులను పాటించే వారు.. మొదటి రోజు నుంచి ఉపవాసం పాటిస్తారు. చివరి రోజు కన్యాపూజ అయిపోయిన తర్వాత మాత్రమే ఉపవాస దీక్షను వదులుతారు. అయితే ఈ తొమ్మిది రోజులు ఎంతో నిష్టగా అమ్మవారిని పూజిస్తారు. చేసిన పూజకు ప్రతిఫలం రావాలంటే భక్తులు కొన్ని నియమాలు పాటించాల్సిందే.

Written By: Kusuma Aggunna, Updated On : October 4, 2024 11:21 am

Navaratri 2024

Follow us on

Navaratri 2024 :  హిందూ సంప్రదాయంలో పండుగలకు ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా దేవీ నవరాత్రులు అయితే దేశవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని భక్తితో పూజించడం వల్ల మంచి జరుగుతుందని నమ్ముతారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తారు. అయితే నిన్నటి నుంచి దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా దుర్గాదేవిని అందరూ భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. తొమ్మిది రోజుల పాటు ఈ నవరాత్రులను జరుపుకుంటారు. అయితే ఈ తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి ఒక్కో రోజు ఒక్కో అవతారంలో దర్శనమిస్తుంది. ఒక్కో రోజు ఒక్కో రంగు దుస్తులు ధరించి, ప్రత్యేకంగా నైవేద్యాలు తయారు చేసి పూజిస్తారు. అయితే నవరాత్రుల సమయంలో చాలామంది ఉపవాసం చేస్తారు. తొమ్మిది రోజుల పాటు ఉపవాసం చేయడం వల్ల అమ్మవారు కోరిన కోర్కెలు నెరవేరుస్తుందని నమ్ముతారు. అయితే దుర్గాదేవి నవరాత్రుల్లో ఉపవాసం చేసేవాళ్లు తప్పకుండా కొన్ని నియమ, నిబంధనలు పాటించాలి. అప్పుడే ఉపవాస ఫలితం ఉంటుంది. లేకపోతే ఎంత భక్తితో పూజించిన వ్యర్థమే. అయితే నవరాత్రుల్లో ఉపవాసం చేసేవారు కొన్ని తప్పులు చేయకూడదు. మరి అవేంటో పూర్తిగా తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

దేవి నవరాత్రులను పాటించే వారు.. మొదటి రోజు నుంచి ఉపవాసం పాటిస్తారు. చివరి రోజు కన్యాపూజ అయిపోయిన తర్వాత మాత్రమే ఉపవాస దీక్షను వదులుతారు. అయితే ఈ తొమ్మిది రోజులు ఎంతో నిష్టగా అమ్మవారిని పూజిస్తారు. చేసిన పూజకు ప్రతిఫలం రావాలంటే భక్తులు కొన్ని నియమాలు పాటించాల్సిందే. ఈ తొమ్మిది రోజుల పాటు ఉదయాన్నే నిద్ర లేచి తలస్నానం చేసిన తర్వాతే అమ్మవారి పూజను మొదలుపెట్టాలి. నవరాత్రులు పూజ చేస్తున్నవాళ్లు బ్రహ్మచర్యం పాటించాలి. శారీరంగా దూరంగా ఉండాలి. అలాగే మంచం మీద కాకుండా నేల మీద మాత్రమే నిద్రించాలి. సుఖాలు అన్నింటిని పక్కన పెట్టాలి. ఎంతో భక్తితో పూజ చేసేవారు అసలు అబద్ధాలు ఆడకూడదు. ప్రశాంతంగా ఉండాలి. చిన్న విషయానికి కోపానికి గురికాకూడదు. అలాగే ఎవరిని దూషించకుండా ఉండాలి. తప్పుడు మాటలు, విమర్శించడం, ఎదుటి వారి మనస్సును బాధపెట్టడం వంటివి చేయకూడదు. నవరాత్రుల్లో అమ్మాయిలను అసలు తిట్టకూడదు. కారణం ఉన్నా కూడా అవమానించకూడదు. అలాగే ఇంట్లో ఎప్పుడూ దీపం వెలుగుతూ ఉండాలి.

ఉపవాస దీక్షను కూడా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఈ సమయంలో గుట్కా, పాన్, మాంసం, మసాలాలు, ఉల్లిపాయ, వెల్లుల్లి, మద్యం, ధూమపానం వంటివి తీసుకోకూడదు. ఉపవాస సమయంలో ఎక్కువగా ఆహారం తీసుకోకూడదు. ఇలా ఎక్కువగా తీసుకుంటే మనస్సు మారుతుంది. భక్తి నుంచి ఆహారంపై వెళ్లకుండా ఈ నియమాలు పాటిస్తారు. అలాగే కావాలని నవరాత్రులను మధ్యలో విరమించకూడదు. ఏదైనా వ్యక్తిగత సమస్యలు, అనారోగ్యం వంటి వాటివల్ల అయితే దేవుడి మీద భారం వేయాలి. సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో నవరాత్రి ఉపవాస దీక్షను వదిలేస్తే తొమ్మిది మంది అమ్మాయిలకు అన్నదానం చేయాలి. అలాగే వారికి దక్షిణ ఇవ్వాలి. అలాగే ఈ ఉపవాస సమయంలో గోళ్లు, గడ్డం, మీసం, గోర్లు, వెంట్రుకలు కత్తిరించకూడదు. అలాగే నల్లని దుస్తులు ధరించకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాలి.

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా చెప్పడం జరిగింది. ఇవి పాటించే ముందు పండితుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.