https://oktelugu.com/

Diwali: దీపావళి తర్వాత ఈ రాశుల వారికి.. కోట్ల వర్షం కురిపిస్తున్న కేతువు!

కేతువును అశుభ గ్రహంగా భావిస్తారు. కానీ కేతువు మంచి సంచారం చేసే స్థానం బట్టి కొన్ని రాశుల వారికి అంతా శుభమే జరుగుతుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 1, 2024 / 04:05 PM IST

    Horoscope

    Follow us on

    Diwali: జ్యోతిష్యంలో ద్వాదశ రాశులపై కేతువు ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. ద్వాదాశ రాశుల్లోని కొన్ని రాశులకి మంచి జరగాలన్ని, చెడు జరగాలన్ని అది కూడా కేతువుపైనే ఆధారపడి ఉంటుంది. సాధారణంగా జ్యోతిష్యం అడిగించినప్పుడు కేతువు ఆ స్థానంలో ఉన్నాడు. దీనివల్ల లాభం, నష్టం ఏర్పడుతుందని పండితులు చెబుతుంటారు. అయితే సెప్టెంబర్‌లో హస్తా నక్షత్రంలోకి వెళ్లిన కేతువు నవంబర్ 10వ తేదీ వరకు ఆ నక్షత్రంలోనే సంచారం చేయనున్నాడు. నవంబర్ 10 అంటే ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. అయితే దీపావళి తర్వాత కేతువు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతున్నాడని పండితులు అంటున్నారు. ఈ పది రోజుల్లో కేతువు వారికి లాభాలను ఇవ్వనున్నాడు. ఏ పని తలపెట్టిన కూడా విజయం దిశగా నడిపిస్తాడు. అయితే కేతువు నవంబర్ 10 నుంచి ఉత్తర ఫాల్గుణి నక్షత్రంలోకి వెళ్తాడు. దీంతో కొన్ని రాశులకు అదృష్టం లభిస్తుంది. సాధారణంగా కేతువును అశుభ గ్రహంగా భావిస్తారు. కానీ కేతువు మంచి సంచారం చేసే స్థానం బట్టి కొన్ని రాశుల వారికి అంతా శుభమే జరుగుతుందని పండితులు అంటున్నారు. మరి ఆ రాశులేవో ఈ స్టోరీలో చూద్దాం.

    కర్కాటక రాశి
    కేతువు మంచి నక్షత్రంలో సంచరిస్తున్నారు. ఈ కారణంగా కర్కాటక రాశి జాతకులకు మంచి జరుగుతుందని పండుతులు అంటున్నారు. కర్కాటక రాశి వారు ఏ పని తలపెట్టిన అందులో విజయం తప్పక వరిస్తుంది. అలాగే ఏవైనా వ్యాపారాలు చేస్తే తప్పకుండా లాభాల బాట పడతారు. ఉద్యోగం, చదువు ఇలా ఒకటేంటి అన్ని రంగాల వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. మీ డబ్బును రెట్టింపు చేసుకోవడానికి ఇది మంచి అవకాశం. కొత్త ఇల్లు కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. కేతువు మీకు అన్ని విధాలుగా లాభాలను ఇవ్వనున్నారు. కాబట్టి అసలు వచ్చిన ఛాన్స్‌ను మిస్ చేసుకోవద్దు. భవిష్యత్తు కోసం ఏవైనా ప్లాన్‌లు ఉంటే ఈ సమయంలో మొదలు పెట్టండి.

    ధనుస్సు రాశి
    కేతువు హస్తా నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ రాశిలో జన్మించిన వారికి అంతా శుభం జరుగుతుంది. తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అలాగే ఉద్యోగులకు జీతాలు పెరగడంతో పాటు పరపతి కూడా పెరుగుతుంది. అలాగే వ్యాపారాలు చేయాలనుకునే వారికి కూడా ఇది మంచి సమయం. డబ్బు రెట్టింపు అవుతుంది. ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కూడా కనిపిస్తాయి. ఈ సమయంలో వ్యాపారాలు ప్రారంభిస్తే బాగా పురోగతి సాధిస్తారు. కొత్త భాగస్వాములు కలవడం వల్ల వారి నుంచి ఆర్థికంగా వృద్ధి కలుగుతుంది.

    కుంభ రాశి
    కేతువు హస్తా నక్షత్రంలో సంచారం వల్ల కుంభ రాశి వాళ్లు ఏ పని ప్రారంభించడానికి అయిన ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. కుంభరాశి వారు చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ఏ పని మొదలు పెట్టిన కూడా మంచి ఫలితాలను పొందుతారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయి.

     

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. ఈ నియమాలు పాటించే ముందు పండితుల సలహాలు తీసుకోగలరు.