Daily Horoscope : 2024 జనవరి 30న ద్వాదశ రాశులపై ఉత్తర పాల్గుణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ కారణంగా ఓ రాశి వారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మరో రాశి ఉద్యోగులకు అనుకూల వాతావరణం. ఈ నేపథ్యంలో మంగళవారం మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..
మేషరాశి:
నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. గతంలో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వాదనలు ఎక్కువగా దిగకుండా ఉండాలి.వివాదాల జోలికి పోవద్దు.
వృషభం:
ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు ఎదుర్కోవచ్చు. జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. స్నేహితులు తప్పుదోవ పట్టించే అవకాశం.
మిథునం:
మాటతీరు పలువురిని ఆకట్టుకుంటుంది. వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోతాయి.
కర్కాటకం:
వ్యాపారులు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగులకు తోటివారు సాయం చేస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.
సింహ:
కొన్ని కష్టాలు ఎదురవుతాయి. వాటిని ధైర్యంగా ఎదుర్కునేందుకు ముందుకు రావాలి. ఏదైనా పనిని ప్రారంభించేముందు ఇతరుల సాయం తీసుకోవాలి.
కన్య:
ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగులు అనుకున్న విజయం పొందుతారు. కొన్ని ముఖ్యమైన ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. శక్తి, సామర్థ్యాలతో పనితీరు మెరుగుపడుతుంది.
తుల:
ఈ రాశివారు ఈ రోజంతా ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. కొన్ని ప్రయాణాలు చేయడం ద్వారా ఒత్తిడిని ఎదుర్కొంటారు.
వృశ్చికం:
పిల్లలతో గడపడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. భవిష్యత్ కోసం వేసే ప్రణాళికలు సక్సెస్ అవుతాయి. మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రానీయకుండా ఉండాలి.
ధనస్సు:
ప్రయాణి చేసేవారు వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. వ్యాపారులు పెట్టుబడి పెట్టడానికి అనుకూలం. ప్రియమైన వారితో మంచిగా ప్రవర్తించండి.
మకర:
జీవిత భాగస్వామితో ఉల్లాసంగా ఉంటారు. అయితే కొందరితో కఠినమైన వైఖరి ప్రవర్తించడం వల్ల మీ మధ్య దూరం పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయి.
కుంభం:
కుటుంబ సభ్యుల మధ్య అశాంతి నెలకొంటుంది. కొత్త వస్తుువులను కొనుగోలు చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి.
మీనం:
కొన్ని పరిస్థితులు ఉత్తేజాన్ని కలిగిస్తాయి. షాపింగ్ ఎక్కువగా చేస్తారు. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. వ్యాపారులు పెట్టుబడుల కోసం ఇతరుల సలహాలు తీసుకోవాలి.