Chanakya Niti: చాణక్యుడు మౌర్య సామ్రాజ్యంలో రాజనీతి శాస్త్రమే కాకుండా ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన అనేక విలువైన సూత్రాలను అందించాడు. ఒక వ్యక్తి కుటుంబ జీవితం సంతోషంగా ఉండడంవల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకు కారణం తన కు లభించే మంచి భార్యని అని అంటారు. భార్యలో ఉండే మంచి లక్షణాల వల్ల భర్తతోపాటు కుటుంబం కూడా సంతోషంగా మారుతుంది. అంతేకాకుండా స్రీ లో ఉన్న కొన్ని లక్షణాల ద్వారా ఇంటికి అదృష్టం కూడా వరిస్తుందని అంటున్నారు. ఒక పురుషుడు విజయానికి కారణం మహిళనే అని అంటారు. అయితే ఆ పురుషుడు విజయం సాధించడానికి ఆ స్త్రీలో ఇలాంటి లక్షణాలు ఉండాలని అంటున్నారు. ఇంతకీ స్త్రీలో ఎలాంటి లక్షణాలు ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది?
Also Read: ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. రెండు దేశాల్లోని కీలక పరిణామాలు ఇవీ
ఒక స్త్రీకి తన కుటుంబం పట్ల భక్తి ఉండాలి. అంటే భర్త దేవుడిగా భావించి.. కుటుంబమే తన సర్వస్వం అని అనుకోవాలి. అంతేకాకుండా భర్త అడుగుజాడల్లో నడుస్తూ భక్త విజయానికి తోడ్పడే విధంగా ఉంటే ఆ కుటుంబంలోని భర్త ఏ విషయంలోనైనా విజయం సాధించగలుగుతాడు. అంతేకాకుండా దేవుళ్ళపై కూడా భక్తి భావంతో ఉండడంవల్ల ఆ ఇంట్లో ఎప్పుడూ ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడి శుభకార వాతావరణ ఏర్పడుతుంది. దీంతో కొన్ని విషయాల్లో అదృష్టం వరిస్తుంది. అందువల్ల భక్తి కలిగిన ఆడవాళ్లు ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ సంతోషంగా ఉంటుంది.
ప్రస్తుత కాలంలో చాలామందికి సహనం ఉండడం లేదు. ముఖ్యంగా ఇంట్లో ఉండే స్త్రీలో సహనం ఉండడం వల్ల ఆ కుటుంబం ఎప్పటికైనా సంతోషంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో భర్తతో లేదా ఇతరులతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో ఓర్పుతో మెదలాలి. ఏమాత్రం అదుపుతప్పిన కుటుంబం పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ముందుగా భర్తపై ప్రభావం పడి ఆందోళనకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఇంట్లో ఎప్పటికీ ఒకే రకమైన పరిస్థితి ఉండదు. ఒక్కోసారి ప్రతికూల వాతావరణం కూడా ఏర్పడుతుంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదాలు ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సమయంలో వివాదాలను మరింతగా పెద్దగా చేయకుండా ప్రశాంతమైన వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం స్రీ చేయాలి. అప్పుడే ఆ కుటుంబం ప్రశాంతంగా మారుతుంది.
కుటుంబ సభ్యుల మధ్య కోపతాపాలు ఉండడం సహజం. కానీ ఎటువంటి పరిస్థితుల్లో నియంత్రణ కోల్పోవద్దు. కొందరు స్రీ లు కొన్ని రకాల వస్తువులను ధ్వంసం చేసే అవకాశం ఉంది. అయితే ఇలా కాకుండా నిగ్రహంతో ఉంటూ ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. అంతేకాకుండా ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ప్రధానమే అని భావించాలి. ముఖ్యంగా గొడవను పెద్దదిగా చేయకుండా సామరస్య పూర్వక వాతావరణాన్ని ఉండేలా చేయాలి.
కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణము ఉండడానికి మాట ప్రధానంగా ఉంటుంది. ఏదైనా మాట్లాడే సమయంలో పెద్దగా అరవకుండా ప్రేమతో మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా భర్తతో మధురంగా మాట్లాడటం వల్ల తాను ప్రేమతో ఉండగలుగుతారు.