Chanakya Niti: అపర చాణక్యుడు కేవలం రాజనీతి శాస్త్రవే కాకుండా మనుషుల జీవితాలకు సంబంధించిన అనేక విలువైన విషయాలను తెలియచెప్పాడు. ఒక వ్యక్తి తాను కోరుకున్న జీవితాన్ని పొందడానికి కొన్ని నియమా నిబంధనలు పాటించాలి. అయితే ఇవి కాస్త నచ్చకపోయినా వీటిని పాటించడం వల్ల జీవితం సుఖశాంతుగా మారుతుంది. ఎవరికైనా డబ్బు బాగా సంపాదించాలన్న కోరిక ఉంటుంది. అయితే కేవలం కష్టపడడం మాత్రమే కాకుండా కొన్ని రకాల వాస్తు నియమాలను పాటించడం వల్ల కూడా లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా ఇంటి జీవితం ఆటంకాలు లేకుండా ఉండాలంటే ఇంట్లో కొన్ని పనులు చేయాలని చెబుతున్నారు. అవేంటంటే?
Also Read: అందరూ ఇంటర్నెట్ వాడతారు. కానీ డేటాను ఆదా చేసే ఉపాయాలు తెలియాలి కదా?
చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం.. ఇల్లు శుభ్రంగా ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. అందువల్ల ఇంటిని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నాడు. ఇల్లు శుభ్రంగా ఉండడం అంటే లక్ష్మీదేవిని ఆహ్వానించడమే. అందువల్ల ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలని అంటారు. అయితే ఇంట్లోని కొన్ని సూచనలు పాటించడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే అవకాశం ఉందని కొందరు పండితులు చెబుతున్నారు.
ఇంట్లో క్లీన్ చేసినా చెత్తను తీసి బయట పారేయడం చాలామందికి అలవాటు. అయితే రాత్రి సమయంలో చెత్తను బయట పారేయకుండా ఒక ప్రత్యేకమైన డస్ట్ బిన్ లో వేసి ఉంచాలి. ఆ తర్వాత దీనిని ఉదయం తీసి బయట ఉంచాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది.
ఇంట్లోని ప్రధాన ద్వారం గుండానే లక్ష్మీదేవి అడుగుపెడుతుందని జ్యోతిష్య శాస్త్రం తెలుపుతుంది. అందువల్ల ఇంటికి ప్రధానంగా ఉన్న గుమ్మం ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలని చెబుతున్నారు. ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే లక్ష్మీదేవి కరుణ కటాక్షాలు ఉండవని అంటున్నారు. అలాగే ఇంటికి తూర్పు తో పాటు ఉత్తరం వైపు తర్వాత ఉంటే ఆయా గుమ్మాల వద్ద ఎప్పుడు చెత్త లేకుండా చూసుకోవాలి. అలా చేసినప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.
అలాగే రాత్రి సమయంలో కిచెన్ లోని సింక్లో శుభ్రం చేయని పాత్రలు ఉంచారు. ఈ పాత్రల ద్వారా బ్యాక్టీరియా ఇల్లంతా వ్యాపిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్ళు అనారోగ్యానికి గురయ్యా ప్రమాదం ఉంది. అంతేకాకుండా వాస్తు ప్రకారం ఇలా శుభ్రం చేయని పాత్రలు ఉండడం వల్ల ఇంటికి అరిష్టమని అంటున్నారు. లక్ష్మీదేవికి శుభ్రంగా ఉండటమే కాకుండా వస్తువులు సక్రమంగా ఉంటే ఎంతో సంతోషిస్తుందని అంటున్నారు. అందువల్ల ఎప్పటికప్పుడు వస్తువులను సక్రమంగా ఉంచుకుంటూ.. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొంటున్నారు.
అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఇంట్లో ఎప్పుడు వాదనలకు దిగకుండా ఉండాలి. ముఖ్యంగా జీవిత భాగస్వామితో వాదనలు పెట్టుకోవడం వల్ల ఇల్లు గందరగోల పరిస్థితిలో మారుతుంది. ఫలితంగా ప్రశాంతమైన వాతావరణ ఉండదు.