Diwali: దీపావళి రోజు బొమ్మల కొలువు.. ఎలా జరుపుకుంటారంటే?

2024 ఏడాది దీపావళి అక్టోబర్ 31న నిర్వహించుకోనున్నారు. ఇల్లు, దుకాణాలు పరిశుభ్రం చేసుకున్న చాలా మంది ఈరోజు వాణిజ్య కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటూ ఉల్లాసంగా గడుపుతారు.

Written By: Srinivas, Updated On : October 31, 2024 11:12 am

Diwali

Follow us on

Diwali: హిందూ పండుగల్లో అతిముఖ్యమైనది దీపావళి. ఈ పండుగ సందర్భంగా చిన్నా, పెద్ద అని తేడా లేకుండా ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతారు. స్వచ్ఛమైన వాతావరణంలో ఉంటూ లక్ష్మీదేవి అమ్మవారికి పూజలుచేస్తారు. చిన్న పిల్లలు బాణ సంచాలతో సందడి చేస్తారు. మహిళలో ఇంట్లో లక్ష్మీపూజలు చేస్తూ ఆధ్యాత్మిక వాతావరణంలో మునుగుతారు. దీపావళి ఫెస్టివ్ లను కొందరు ప్రత్యేకంగా జరుపుకుంటారు. కొందరు వాణిజ్య సముదాయాలు ఉన్న వారు దుకాణాల్లో లక్ష్మీపూజలు చేస్తారు. మరికొందరు నోములు నిర్వహించుకుంటారు. అయితే కొందరు ఈరోజున బొమ్మల కొలువు కూడా చేస్తారు. అదెలా జరుపుకుంటారంటే?

2024 ఏడాది దీపావళి అక్టోబర్ 31న నిర్వహించుకోనున్నారు. ఇల్లు, దుకాణాలు పరిశుభ్రం చేసుకున్న చాలా మంది ఈరోజు వాణిజ్య కార్యకలాపాలకు దూరంగా ఉంటారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఉంటూ ఉల్లాసంగా గడుపుతారు. సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు నిర్వహించిన తరువాత బాణ సంచా కాలుస్తారు. దీపావళి ఒక రోజు ముందు ధన త్రయోదశి పూజలు నిర్వహించి..మరుసటిరోజు దీపావళి వేడుకలు నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా బొమ్మల కొలువు కూడా నిర్వహిస్తారు.

సాధారణంగా బొమ్మల కొలువు అనగానే సంక్రాంతి పండుగ గుర్తుకు వస్తుంది. కానీ దీపావళి సందర్భంగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి అమ్మవార్లను ప్రత్యేకంగా పూజిస్తారు. ఆ తరువాత ఏ రోజు అయిత నరక చతుదర్దశి ఉంటుందో ఆరోజున చెక్కలతో చేసిన బొమ్మలను మూడు నుంచి ఐదు మెట్లు కలిగిన ఓ టేబుల్ పై ఉంచుతారు. ముందుగా దీనిపై ఒక పరిశుభ్రమైన చీరను ఉంచి ఆ తరువాత గౌరమ్మ, లక్ష్మీదేవిల ప్రతిమలను మధ్యలోఉంచుతారు. ఆ తరువాత పూజలు చేస్తారు.

దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. కానీ బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకునేవాళ్లు లక్ష్మీ అమ్మవారితో పాటు పార్వతి, సరస్వతి అనుగ్రహం పొందుతారు. ఇక సాయంత్రం ఇళ్లతో పాటు వాణిజ్య సముదాయాల్లో లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు చేస్తారు. కొందరు ఉదయం నుంచి నిష్టతో ఉంటూ సాయంత్రం పూజలో పాల్గొంటారు. మరికొందరు ఈరోజు వాణిజ్య సముదాయాల్లో పూజలు నిర్వహించిన తరువాత ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరు. మరుసటి రోజు మాత్రమే షాపులను తెరుస్తారు. ఇక సాయంత్రం పూజల తరువాత పిల్లలతో కలిసి బాణ సంచా కాలుస్తారు. అయితే పర్యావరణ సమతుల్యతను కాపాడడానికి తక్కువ మొత్తంలో బాణ సంచాను వినియోగించాలని పర్యావరణ వేత్తలు కోరుకుంటున్నారు.

అంతేకాకుండా దీపాళి బాణ సంచాలు కాల్చే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కాటన్ దుస్తులు వేసుకొని బాణ సంచా కాల్చాలి.ముఖ్యంగా చిన్న పిల్లలు బాణ సంచా కాల్చాలనుకుంటే వారి వెంట తల్లిదండ్రులు కచ్చితంగా ఉండాలి. అగ్నిప్రమాదం జరిగితే అప్రమత్తం కావడానికి అందుబాటులో నీటిని ఉంచుకోవాలి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే దగ్గర్లోని ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలి. ఎక్కువగా పోల్యూషన్ అయ్యే వాటిని కాకుండా గ్రీన్ టపాసులు కాల్చేందుకు ప్రయత్నించాలి. అలాగే బాణ సంచాల కొనుగోలుకు వెళ్లిన సమయంలో అప్రమత్తంగా ఉండాలి. పట్టణం, నగరం చివరి ప్రదేశంలో విక్రయించే షాపులకు వెళ్లడం వల్ల భద్రత ఎక్కువగా ఉంటుంది.