Today 13 August 2025 Horoscope: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. ఈ సందర్భంగా బుధవారం కొన్ని రాశుల వారికి అనుకూలమైన వాతావరణం ఉండనుంది. మరి కొన్ని రాశుల వారు కొత్త వారితో జాగ్రత్తగా ఉండాలి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఉద్యోగులకు ఈరోజు పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. వీరికి కొన్ని అదనపు బాధ్యతలు వస్తాయి. వ్యాపారులకు ఆశించిన లాభాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్యం కోసం బిజీగా మారిపోతారు. అనుకున్న పనులు పూర్తి చేయడానికి తీవ్రంగా కష్టపడతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇంట్లో ఏమైనా సమస్యలు ఉంటే ఈరోజు పరిష్కారం అవుతాయి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారులకు పెద్దల సలహాలు పనిచేస్తాయి. సోదరులతో ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొనడానికి ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామికి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కొన్ని వస్తువులకు వల్ల ఖర్చులు పెరుగుతాయి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులకు అదనపు బాధ్యతలు చేకూరుతాయి. అధికారుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. అయితే కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్న తర్వాతే పెట్టుబడులా జోలికి వెళ్లాలి. ఇతరుల నుంచి రావాల్సిన డబ్బు ఈరోజు వస్తుంది. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్లో ఉన్న డబ్బు వసూలు అవుతుంది. కొన్ని పనుల వల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. ఉద్యోగులు సమయస్ఫూర్తితో ప్రాజెక్టులను పూర్తి చేయడం వల్ల అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయం రావడంతో సంతృప్తిగా ఉంటుంది.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : . ఈ రాశి వారు ఈరోజు విజయవంతంగా తమ పనులను పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ అనుబంధాలు పెరిగిపోతాయి. కొన్ని వస్తువుల కోసం ఖర్చులు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. స్నేహితులతో సరదాగా ఉండగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . కన్య రాశి వారికి ఈరోజు కష్టపడితే నే పనులు పూర్తవుతాయి. అయితే కొందరి చేష్టల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పిల్లల అనారోగ్యంపై ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పూర్వికుల ఆస్తి విషయంలో శుభవార్తలో వినయ్ అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు వివిధ మార్గాల నుంచి అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆ సంస్థ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారు పెండింగ్ లో ఉన్న పనులను ఈరోజు పూర్తి చేయగలుగుతారు. వ్యాపారులకు ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగులకు ఊహించని కంపెనీ నుంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. గతంలో ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి ఇప్పుడు బయటపడతారు. ఇతరుల వద్ద ఉన్న డబ్బు తిరిగి వస్తుంది. అర్హులైన వారికి వివాహ ప్రయత్నాలు ప్రారంభమవుతాయి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) :. ఈ రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు ఈరోజు పూర్తవుతాయి. అయితే కొన్ని పనులు ఖర్చులతో కూడుకొని ఉంటాయి. ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి. వ్యాపారులకు ఊహించిన దానికంటే లాభాలు ఎక్కువగానే ఉంటాయి. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోయి సంతోషంగా ఉండగలుగుతారు. సోదరుల మధ్య ఉన్న ఆస్తి వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారులు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : . ఉద్యోగుల జీతం పెరిగే అవకాశం ఉంది. కొందరికి కోరుకుంటే బదిలీ కూడా అవుతుంది. ఆదాయం అనుకోకుండా పెరిగే అవకాశం ఉంది. దీంతో వ్యాపారాలు సంతృప్తిగా ఉంటారు. పిల్లల చదువుపై తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకుంటారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. ఎందుకంటే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు పలుస్తాయి. వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో చేసే వ్యాపారం ఈరోజు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఎవరికి డబ్బు గురించి మాట ఇవ్వకుండా ఉండాలి. కొన్ని పనులు కష్టపడితేనే పూర్తవుతాయి. అందువల్ల ఎవరిని నమ్మకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : . సమస్యల పరిష్కారం కోసం మీ రాజు వారు ఈ రోజు కష్టపడుతూ ఉంటారు. అయితే కొందరికి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అనవసరపు వివాదాల్లోకి కలుగుచకుండా ఉండాలి. స్నేహితులతో కలిసి సరదాగా ఉంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారికి ఈ రోజు సమాజంలో గుర్తింపు లభిస్తుంది. తల్లిదండ్రుల అండతో విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొని విజయం సాధిస్తారు. వ్యాపారులకు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. ఈ ఉత్సాహంతో మరికొన్ని పెట్టకూడదు పెట్టడానికి ఆసక్తి చూపుతారు. జీవిత భాగస్వామితో ఈరోజు సంతోషంగా ఉండగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న నిభేదాలు తొలగిపోతాయి.