https://oktelugu.com/

Bhogi: అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? దీని వెనుక ఏదైనా కారణం ఉందా?

భోగి పిడకలతో ఎంతో సంతోషంగా భోగి మంటలు(Bhogi Mantalu) దగ్గరకు వెళ్తారు. ఇంటిలో ఉన్న పాత వస్తువులు అన్ని కూడా అందులో వేసి భోగి పండుగను జరుపుకుంటారు. అయితే ఇలా భోగి మంటలు వేయడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న ఆ శాస్త్రీయ కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 12, 2025 / 07:02 PM IST

    Bhogi Mantalu

    Follow us on

    Bhogi: అందరూ ఎంతగానో ఎదురు చూసే సంక్రాంతి(Sankranti) పండుగ రానే వచ్చింది. మకర సంక్రాంతి పండుగ ముందు రోజు అందరూ కూడా భోగి పండుగను జరుపుకుంటారు. భోగి పండుగ(Bhogi) వస్తుంటే.. అందరూ కూడా భోగి పిడకలు చేసి మంటలు వేస్తారు. ఇంటికి ఎంత దూరంలో ఉన్నా కూడా భోగి పండుగ రోజుకి అందరూ కూడా కుటుంబ సభ్యుల(Family Members) దగ్గరకు చేరుకుంటారు. ఇళ్లు అన్ని కూడా పండుగ వాతావరణంతో నిండిపోతాయి. ప్రతీ ఒక్కరూ కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. కొత్త దుస్తులతో, ఆట పాటలతో ఇంటిల్లిపాది భోగి మంటలు(Bhogi Mantalu) వేస్తారు. ఎంతో సంతోషంగా ఆట, పాటలతో ఎంజాయ్(Enjoy) చేస్తారు. ముఖ్యంగా పిల్లలు అయితే భోగి పిడకలతో ఎంతో సంతోషంగా భోగి మంటలు(Bhogi Mantalu) దగ్గరకు వెళ్తారు. ఇంటిలో ఉన్న పాత వస్తువులు అన్ని కూడా అందులో వేసి భోగి పండుగను జరుపుకుంటారు. అయితే ఇలా భోగి మంటలు వేయడానికి కొన్ని శాస్త్రీయ కారణాలు ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న ఆ శాస్త్రీయ కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

    సంక్రాంతికి సూర్యుడు దక్షిణ యానం నుంచి ఉత్తర యానంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. ఈ చలి నుంచి విముక్తి పొందడానికి భోగి మంటలు వేస్తారని చెప్పుకుంటారు. అలాగే భోగి మంటలు వేయడం వల్ల కష్టాలు అన్ని కూడా తొలగిపోయి సంతోషాలు ఇంట్లో ఉంటాయని నమ్ముతూ వేస్తారట. అయితే ఈ భోగి మంటల వెనుక ఓ పురాణ కథ కూడా ఉంది. శ్రీమహావిష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేశాడట. ఆ సమయంలో ఓ వరం ఇచ్చాడు. పాతాళానికి రాజుగా బలి చక్రవర్తిగా ఉండాలని చెబుతాడు. దీనికి ముందు భూలోకంలో ఉన్న ప్రజలను ఆశీర్వదించాలని వరం ఇస్తారు. దీంతో బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ భోగి మంటల వల్ల ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ ధనుర్మాసంలో వచ్చే రోగాల నుంచి ఈ భోగి మంటలు విముక్తి కలిగిస్తాయి.

    భోగి మంటల్లో ఆవు పేడతో చేసిన పిడకలు వేస్తారు. వీటిని అందులో వేసి కాల్చడం వల్ల రోగాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని పండితులు చెబుతున్నారు. వీటి వల్ల గాలి శుద్ధి అవుతుంది. అలాగే సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా అన్ని కూడా నశిస్తాయి. వీటిని కాల్చిన తర్వాత వచ్చిన గాలి వల్ల శరీరంలోని నాడులు అన్ని కూడా ఉత్తేజం అవుతాయని నమ్ముతారు. అలాగే భోగి మంటల్లో పాత వస్తువులను కాల్చుతుంటారు. ఇంట్లో ఉన్న పాత వస్తువులను కాల్చడం వల్ల చెడు అంతా పోయి మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అందుకే భోగి పండుగ రోజు ఇంట్లో ఉన్న పాత వస్తువులను పడేసి ఈ ఏడాదిలో అంతా కూడా మంచి జరగాలని భావిస్తారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాలు కోసం పండితులను సంప్రదించగలరు.