https://oktelugu.com/

Prashant Verma : హనుమాన్ ‘ మూవీ వచ్చి సంవత్సరం అవుతున్న వేళ టాటు తో దర్శనమిచ్చిన ప్రశాంత్ వర్మ…

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్నారు. కానీ యంగ్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ మాత్రం తను చేసిన కొన్ని సినిమాలతోనే మంచి ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా పాన్ ఇండియాలో కూడా తన సత్తాను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాడు... ప్రస్తుతం ఆయనతో బాలీవుడ్ హీరోలు సైతం సినిమాలు చేయడానికి పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...

Written By:
  • Gopi
  • , Updated On : January 12, 2025 / 07:10 PM IST

    Prashant Verma

    Follow us on

    Prashant Verma : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ… ప్రస్తుతం ఈయన జై హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే 2024వ సంవత్సరం సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఆయన ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో ఆయన చాలావరకు జాగ్రత్తలైతే తీసుకొని ఆ సినిమాని చాలా బాగా తెరకెక్కించాడు. ఇక మొత్తానికైతే సినిమా సూపర్ సక్సెస్ సాధించడంతో ఒక్కసారిగా ఆయన పేరు పాన్ ఇండియా వైడ్ గా వినిపించింది. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ లాంటి దర్శకుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. మరి ఇదిలా ఉంటే ఎక్స్ వేదికగా ఆయన ఒక ఫోటోనైతే షేర్ చేసుకున్నాడు. ఇక తన చెయ్యి మీద గదకు సంబంధించిన సింబల్ ని టాటూ గా వేయించుకొని హనుమాన్ సినిమా రిలీజై వన్ ఇయర్ అవుతుంది అంటూ ఓల్డ్ మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ ఏదో పెట్టాడు. మరి ఏది ఏమైనా కూడా ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో భారీ విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సంపాదించి పెట్టుకున్నాడు…

    ఇక ఇప్పుడు ఆయన దర్శకత్వంలో చేస్తున్న ‘జై హనుమాన్’ అనే సినిమా మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా రిషబ్ శెట్టి నటిస్తూ ఈ సినిమాతో సూపర్ డూపర్ క్రేజ్ ను కూడా తెచ్చుకున్నాడు.

    మరి ఈయన చేసిన కాంతార సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఆయనకు మంచి గుర్తింపైతే వచ్చింది. మరి హీరోగా దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన హనుమంతుడిగా ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమా ఎప్పుడొస్తుంది అనే దానిమీద సరైన క్లారిటీ లేదు.

    కానీ ప్రశాంత్ వర్మ తొందర్లోనే సినిమాని రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవాలంటే మాత్రం ఈ దర్శకుడు తన సత్తా చాటుకోవాల్సిన అవసరమైతే ఉంది. చూడాలి మరి ఇక మీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు. తద్వారా ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు అనేది…