Site icon OkTelugu

Chaganti Koteswara Rao: ప్రదక్షిణ చేస్తూ ఇతరులతో మాట్లాడుతున్నారా..మీ పుణ్యఫలం గోవిందా…

Chaganti Koteswara Rao

Chaganti Koteswara Rao

Chaganti Koteswara Rao: మనలో చాలామందికి దైవభక్తి అధికంగా ఉంటుంది. వారాలవారీగా ఆలయాలకు వెళ్లే అలవాటు కూడా ఉంటుంది. అవకాశం కుదిరితే దూర ప్రాంతాలలో కొలువై ఉన్న ఆలయాలను కూడా సందర్శించే అవకాశం ఉంటుంది. ఇష్ట దైవానికి మెండుగా పూజలు చేస్తూ.. స్వామివారి కరుణాకటాక్షాలు లభించే విధంగా చూడాలని మొక్కుకుంటాం..

ఆలయాలకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణాలు చేయడం సర్వసాధారణం. కొందరైతే ఫలానా సార్లు ప్రదక్షిణాలు చేస్తామని మొక్కుకుంటారు. కొందరైతే అంగప్రదక్షిణలు కూడా చేస్తుంటారు. తమ నమ్మకం ఆధారంగా పూజలు జరుపుతుంటారు. అయితే ప్రదర్శనలు చేస్తున్నప్పుడు కొందరు నోటికి తాళం వేసుకొని. పక్కవారితో మాట్లాడుకుంటూ ఆ క్రతువును పూర్తి చేస్తుంటారు. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఇలా చేయకూడదట. ఈ విషయాన్ని ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఇటీవల వివరించారు. ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు కచ్చితంగా నియమాలు పాటించాలని ఆయన సూచించారు. ప్రదర్శన చేస్తున్నప్పుడు నోటికి తాళం వేయాలని.. పక్కవారితో కనీసం మాట్లాడకూడదని ఆయన పేర్కొన్నారు. ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు ఇతరులతో మాట్లాడితే ఉపయోగం ఉండదట. దాని వల్ల లభించే పుణ్యం పక్కన ఉన్న వాళ్లకు వెళ్లిపోతుందట. అందువల్లే ప్రతిపానికి ఒక పద్ధతి ఉంటుందని.. భగవత్ సంబంధిత క్రతవులలో శ్రద్ధ పాటించాలని.. క్రమశిక్షణ అనుసరించాలని కోటేశ్వరరావు వివరించారు.

కోటేశ్వరరావు ప్రముఖ ప్రవచనకర్తగా తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. దేశవ్యాప్తంగా ఉన్న శైవ, వైష్ణవ క్షేత్రాల గురించి ఆయన అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. పైగా సనాతన ధర్మం గురించి లోతుగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. గ్రాంధికంలో పౌరాణిక పద్యాలను చదువుకుంటూ.. వాటి అర్ధాన్ని అర్థవంతంగా చెబుతుంటారు. పైగా ఆయన గొంతు కూడా అద్భుతంగా ఉంటుంది. అందువల్లే ఆయన ప్రవచనాలను వినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.

ఆమధ్య కోటేశ్వరరావు తమిళనాడులో ఉన్న అరుణాచలం క్షేత్రం గురించి చెప్పారు. ఆ క్షేత్రం గొప్పతనం.. దాని చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ద్వారా వచ్చే ఉపయోగాన్ని వివరించారు. దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి అరుణాచలం క్షేత్రానికి భక్తులు విరివిగా వెళ్తున్నారు.. ఇలా దేశంలో ఉన్న అనేక క్షేత్రాల గురించి చాగంటి కోటేశ్వరరావు వివరిస్తుంటారు. ఇప్పుడు ఆ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయంటే దానికి ప్రధాన కారణం చాగంటి కోటేశ్వరరావే.

Exit mobile version