Homeఆధ్యాత్మికంShri Rama: 'శ్రీరామ' అనే పేరులో ఆరుగురు దేవతలు ఉన్నారా?

Shri Rama: ‘శ్రీరామ’ అనే పేరులో ఆరుగురు దేవతలు ఉన్నారా?

Shri Rama: శ్రీరామ నామం ఎంతో మధురం.. అని అంటూ ఉంటారు. కొందరు రామకోటి రాస్తూ శ్రీరాముడి ఆశీస్సులు పొందుతారు. శ్రీరామ అంటే కేవలం విష్ణు మాత్రమే కాదని సకల దేవతలు ఈ నామంలో ఉన్నాయని ఇప్పటికే చాలామంది ఆధ్యాత్మిక వాదులు పేర్కొన్నారు. అయితే కొన్ని గ్రంథాలు, పురాణాల ప్రకారం ఈ నామములో ఆరుగురు దేవతలు కొలువై ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజు శ్రీరామ నామ జపం చేయడం వల్ల ఆరుగురు దేవతలను పూజించినట్లు అవుతుందని అంటున్నారు. అంతేకాకుండా సమస్యలు, బాధలు ఉన్నప్పుడు శ్రీరామ నామం జపం చేయడం వల్ల అవి తొలగిపోతాయని కూడా చెబుతున్నారు. అసలు శ్రీరామ నామం లో ఉన్న ఆరుగురు దేవతలు ఎవరు? వారి పేర్లు ఏంటి?

శ్రీరామ అనగానే మనకు విష్ణువు అవతారమైన రాముడు గురించి మాత్రమే చర్చించుకుంటాం. కానీ శ్రీరామ అనే పదాన్ని మాత్రం ఆలయాలకు వెళ్లినప్పుడు పలుకుతూ ఉంటాం. అయితే శ్రీరామ అనే పేరును పలకడం రాముడిని గుర్తు చేసుకోవడం మాత్రమే కాకుండా ఆరుగురు దేవతలను స్మరించడం అని అంటున్నారు.

శ్రీరామలో.. మొదటి శ్రీ అంటే లక్ష్మి తత్వం. శ్రీరామ నామంలో మొదటి అక్షరం సంపద, శాంతి, శ్రేయస్సు ప్రసాదించే లక్ష్మీదేవత ఉన్నట్లు చెబుతారు.

శ్రీరామలో.. ర అంటే రుద్రశక్తి. శివుడి తత్వాన్ని ఈ అక్షరం సూచిస్తుంది. రామ నామంలో కూడా శివుడు కొలువై ఉన్నాడని ఈ పదం తెలుపుతుంది.

శ్రీరామలో.. ర+అ=రా.. అంటే ఇందులో ఆ అక్షరం అగ్ని దేవుడిని సూచిస్తుంది. ప్రతి కార్యక్రమంలో అగ్ని దేవుడిని కొలుస్తుంటాం. శుద్ధి శక్తికి ప్రత్యేకగా అగ్నిదేవుడని కొలుస్తూ ఉంటాం. శ్రీరామ నామం జపించినప్పుడు అగ్నిదేవుడు కూడా ఉంటాడు.

శ్రీరామలో.. చివరి అక్షరం మ లో ముగ్గురు దేవతలు కొలువై ఉన్నట్లు తెలుపుతున్నారు. అంటే బ్రహ్మ, విష్ణు తో పాటు ఆదిశక్తి స్వరూపిణి కూడా ఈ అక్షరం లో ఉన్నట్లు చెబుతారు.

ఇలా శ్రీరామలో ఆరుగురు దేవతలు ఉండడంవల్ల ప్రతిసారి శ్రీరామ అనే నామం జపించడం వల్ల వీరు సంతోషిస్తారని అంటున్నారు. వీరితోపాటు శ్రీరామ అని పేరు చెప్పగానే ముందుగా స్పందించేది హనుమంతుడు. విష్ణు సేవ కోసం శివుడే హనుమంతుడి రూపం లో వచ్చాడని కొన్ని పురాణాల్లో ద్వారా తెలుస్తుంది. అయితే శివుడితోపాటు పార్వతీ కూడా వస్తానని అంటుంది. కానీ హనుమంతుడు బ్రహ్మచర్య రూపం వల్ల పార్వతికి అడ్డు చెబుతాడు. అయినా కూడా శ్రీరామ అనే పదంలో ఆదిశక్తి స్వరూపిణి కొలువై ఉంటుందని శ్రీరామ నామం అనే పదం ద్వారా తెలుస్తుంది. ప్రతిరోజు మంచి మనసుతో కొన్నిసార్లు శ్రీరామ నామం జపించడం వల్ల ఈ దేవతల ఆశీస్సులు ఉంటాయని ఆధ్యాత్మిక పండితులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శ్రీరామ నామం జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండి అనుకున్న పనులు కూడా పూర్తవుతాయని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper
Exit mobile version