Ambala Kalika Matha: భక్తుల కోరికలను నెరవేర్చడానికి అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తుంటుంది. వీటిలో కాళికా రూపం ప్రత్యేకం. దసరా నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారికి కాళికా రూపంలో చూస్తాం. అయితే సౌత్ సైడ్ కాళికా రూపంలో అమ్మవారు తక్కువగా కనిపిస్తారు. కానీ నార్త్ లో ఈ అవతారంలో ఉన్న అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. వీటిలో కలకత్తాలోని ఆలయంల ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే మరో ఆలయంలోనూ కాళికా దేశి రూపంలో అమ్మవారు దర్శనమిస్తూ భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు. ఇక్కడ విశేషమేంటంటే.. పాలతో అమ్మవారిని అభిషేకం చేస్తే అనుకున్నవి జరుగుతాయట. మరి ఈ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందామా..
ప్రముఖ ఆలయాలు ఉన్న ఉత్తర ప్రదేశ్ లో కాళికా దేవి అమ్మవారి ఆలయం కూడా ప్రాముఖ్యతను పొందింది. ఈ రాష్ట్రంలోని అంబాలాలలో కొలువైన అమ్మవారిని పూజించే విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఇక్కడ మహిళలు అమ్మవారికి నిత్యం పాలతో అభిషేకం చేస్తారు. తాను అనుకున్న పనులు నెరవేరడానికి ఇలా చేస్తారు. పాలతో అమ్మవారికి అభిషేకం చేస్తే ఆ తల్లి దీవెనలు కచ్చితంగా ఉంటాయని నమ్ముతారు.
సంతానం లేని వారు ఈ ఆలయానికి ఎక్కువగా వస్తుంటారు. అమ్మవారిని పాలతో స్నానం చేయించి పాలు, పండ్లు సమర్పిస్తే అమ్మవారి దీవెన కచ్చితంగా ఉంటుందని స్థానిక అర్చకులు తెలుపుతున్నారు. భారతదేశంలోని ఈ ఆలయంలో మాత్రమే అమ్మవారిని పాలతో అభిషేకం చేస్తారని అంటున్నారు. కేవలం నవరాత్రి ఉత్సవాల్లో మాత్రమే అమ్మవారిని అభిషేకం చేయగా ఇక్కడ నిత్యం క్షీరాభిషేకం చేస్తారని చెబుతున్నారు.