https://oktelugu.com/

Numerology : న్యూమరాలజీ ప్రకారం ఈనెంబర్ కలిగిన వ్యక్తులు కష్టాల్లో కూరుకుపోతారు..

4 నెంబర్ కలిగిన వారు సోదరులతో సరదాగా ఉంటారు. ఈ నెంబర్ వచ్చే విద్యార్థులు భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. 5 నెంబర్ వచ్చే వారు సాయంత్రం సరదాగా ఉంటారు.

Written By:
  • NARESH
  • , Updated On : May 5, 2024 / 11:10 PM IST

    According to numerology, people with this number will face difficulties.

    Follow us on

    Numerology : న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీలు శుభప్రదంగా ఉంటాయి. మరికొన్ని రోజులు కలిసి వస్తాయి. పుట్టిన తేదీలన్నీంటిని కలపగా వచ్చే నెంబర్ ప్రకారం ఆరోజు తమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని న్యూమరాలజిస్టులు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో తమ పుట్టిన తేదీను యాడ్ చేయగా 1 నుంచి 9 అంకె వరకు వచ్చే వారు తమ జీవితం ఈరోజు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కో నెంబర్ పై ఏవిధంగా ఉందో తెలుసుకుందాం..

    2024 మే 5న పుట్టిన తేదీలను యాడ్ చేయగా 1 నెంబర్ వచ్చేవారు దూర ప్రయానాలు చేయాల్సి ఉంటుంది. వీరు సరదాగా స్నేహితులతో కలిసి ఉంటారు. ఇతరుల సూచనలు పాటిస్తారు. 2 నెంబర్ వచ్చే వారి కోరికలు ఈరోజు నెరవేరుతాయి. ఉద్యోగాల కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. సంతోషంగా గడుపుతారు. 3 నెంబర్ వచ్చేవారు కుటుం సభ్యులతో సరదాగా గడుపుతారు. జీవిత భాగస్వామి మద్దతు పొందుతారు.

    4 నెంబర్ కలిగిన వారు సోదరులతో సరదాగా ఉంటారు. ఈ నెంబర్ వచ్చే విద్యార్థులు భవిష్యత్ గురించి ఆలోచిస్తారు. 5 నెంబర్ వచ్చే వారు సాయంత్రం సరదాగా ఉంటారు. ఉద్యోగులు ఆందోళనతో ఉంటారు. 6 నెంబర్ వచ్చే వారి జీవితం సాఫీగా ఉంటుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయగలుగుతారు. కొందరు మాత్రం కష్టాల కుంపటిలో కూరుకుపోతారు.

    న్యూమరాలజీ ప్రకారం 7వ నెంబర్ వస్తే ఉద్యోగులు ఉత్తేజంగా ఉంటారు. వ్యాపారుల శ్రమ తక్కువగా ఉంటుది. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. 8వ నెంబర్ వచ్చే వారి పిల్లల చదువులపై బాధ్యతను కలిగి ఉంటారు. చిన్న నాటి స్నేహితులను కలుస్తారు. 9వ నెంబర్ వచ్చే వారు ప్రైవేట్ ఉద్యోగులైతే కొత్త బాధ్యతలు చేపడుతారు. బంధువుల నుంచి సాయం పొందుతారు.