https://oktelugu.com/

Mileage  vehicles : ఎక్కువ మైలేజ్ ఇచ్చే వెహికిల్స్ ఇవే..

ఇందులో ఎలక్ట్రికల్ సర్దుబాటు చేయగల ఓఆర్ వీఎం ఆపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని కలిగి ఉంది. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 66 బీహెచ్ పీ పవర్ 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ లీటర్ పెట్రోల్ పై 24.12 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

Written By:
  • NARESH
  • , Updated On : May 5, 2024 / 11:08 PM IST

    These are the vehicles that give the Highest Mileage

    Follow us on

    Highest Mileage  vehicles: కారు కొనుగోలు చేసేటప్పుడు మైలేజ్ విషయంలో ప్రాధాన్యత ఇస్తారు. మంచి మైలేజ్ ఇచ్చే కారు ఏదో సెర్చ్ చేస్తారు. ఈ తరుణంలో కొన్ని కంపెనీలు వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. వీటిలో మారుతి ముందంజలో ఉంటోంది. మారుతి నుంచి ఇప్పటికే ఎన్నో మోడళ్లు డిఫరెంట్ వేరియంట్లను కలిగి వచ్చాయి. ఈ క్రమంలో మైలేజ్ ఇచ్చే కార్లు కూడా రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిలో బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు ఏదంటే?

    మారుతి కంపెనీ నుంచి బెస్ట్ మైలేజ్ ఇచ్చే కారు ఏదంటే ఆల్టో కే 10 అని నిరభ్యరంతంగా చెప్పొచ్చు. ఈ మోడల్ 1 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉండడంతో పాటు 67 బీహెచ్ పీ పవర్, 89 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఏ ఎంటీ టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ కారు 214 లీటర్ల ఫ్యూయెల్ కెపాసిటికి కలిగి ఉంది. ఆల్టోకే కే 10 కారు లీటర్ పెట్రోల్ పై 24.39 కిలోమీటరల్ మైలేజ్ ఇష్తుంది. సీఎన్ జీ వేరియంట్ లో 33.40 కిలోమీటర్ల వరకు దూసుకెళ్తుంది.

    బజాజ్ కు చెందిన క్యూట్ కూడా మైలేజ్ వెహికల్ గా చెప్పొచ్చు. ఇది పెట్రోల్ పై 13.1 బీహెచ్ పీ పవర్ తో పాటు 18.9 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే సీఎన్ జీపై 10.98 బీహెచ్ పీ పవర్ తో పాటు 16.1 ఎన్ ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మోడల్ పెట్రోల్ పై 35 కిలోమటర్లు, సీఎన్ జీపై 43 కిలోమీటర్ల మైలేజ్ ఇష్తుంది. దీనిని రూ.3.61 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    మారుతికి చెందిన ఎస్ ప్రెస్సో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్పోటైన్మెంట్ సిస్టమ్ తో పాటు మంటెడ్ కంట్రోల్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఎలక్ట్రికల్ సర్దుబాటు చేయగల ఓఆర్ వీఎం ఆపిల్ కార్ ప్లే ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీని కలిగి ఉంది. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు 66 బీహెచ్ పీ పవర్ 89 ఎన్ ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ మోడల్ లీటర్ పెట్రోల్ పై 24.12 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.