https://oktelugu.com/

China news : గంటలకు 450 కి. మీ వేగంతో మరో హై స్పీడ్ ట్రైన్.. ఖర్చు తెలుసా?

చైనా మరో హైస్పీడ్ రైలును అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ రైలు ట్రయల్ రన్‌లోనే ఏకంగా గంటకు 453 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. దీంతో ప్రతి ఒక్కరు అబ్బురపడ్డారు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : December 31, 2024 / 06:00 AM IST

    China

    Follow us on

    China news : చైనా మరో హైస్పీడ్ రైలును అందుబాటులోకి తీసుకొని వచ్చింది. ఈ రైలు ట్రయల్ రన్‌లోనే ఏకంగా గంటకు 453 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది. దీంతో ప్రతి ఒక్కరు అబ్బురపడ్డారు. దీన్ని సీఆర్‌450గా పిలుస్తారు. ఈ రైలుకు ఆదివారం చైనా రాజధాని బీజింగ్‌లో ట్రయల్స్ చేశారు అధికారులు. గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ సీఆర్450 రైలు ప్రాయణం చేసింది. ఈ విషయాన్ని స్వయంగా అధికారులే వెల్లడించారు. ఇదెలా ఉంటే ఈ రైలు మిగిలిన రైళ్ల కంటే డిజైన్‌ విషయంలో చాలా మార్పుతో ప్రయాణీకుల ముందుకు వచ్చింది. అధిక వేగంతో వెళ్లేందుకు దాని ఆకృతిలో మార్పు చేశారట అధికారులు.

    ఇదెలా ఉంటే ఈ రైలు చూడడానికి చాలా సన్నగా, బుల్లెట్‌ లాంటి ఆకారాన్ని పోలి ఉంది. ఈ రైలు అత్యధికంగా గంటకు 450 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది. అయితే ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తే.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత స్పీడుతో నడిచే రైలుగా నిలుస్తుంది అంటున్నారు చైనా అధికారులు. ఈ రైలు ఎక్కితే బీజింగ్‌ నుంచి షాంఘైకి చాలా తక్కువ సమయంలో అంటే రెండున్నర గంటల్లోనే వెళ్లవచ్చు. ప్రస్తుతం బీజింగ్ నుంచి షాంఘైకి వెళ్లాలంటే 4 గంటలు పడుతుంది.

    ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా బెటర్ ట్రైన్ వ్యవస్థ చైనాలోనే ఉంది. చైనాలో హైస్పీడ్ రైలు ట్రాక్‌లు 45 వేల కిలోమీటర్ల పొడవునా ఉన్నాయి. సీఆర్‌450 రైలుకు డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహిస్తామనిఈ ఏడాది సెప్టెంబర్‌లోనే చైనా ప్రభుత్వరంగ రైల్వే సంస్థ పేర్కొంది. అన్నట్టుగానే పరీక్షలు నిర్వహించారు. ఇక చైనా 14వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ఈ సీఆర్450 రైల్వే ప్రాజెక్టును మొదలు పెట్టారు. దీనికింద హైస్పీడ్‌ రైళ్లు, వంతెనలు, ట్రాక్‌లు, సొరంగాలు నిర్మించాలని నిర్ణయించింది చైనా.

    ఇక ఈ సీఆర్ 450 రైలు బరువు కేవలం 10 టన్నులు మాత్రమే ఉంటుంది అంటున్నారు అధికారులు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సీఆర్‌400 మోడల్‌ కంటే ఇది 12 శాతం బరువు తక్కువ ఉంటుంది. ఇక ఈ రైలు 20 శాతం తక్కువ విద్యుత్‌ను తీసుకుంటుందట. అంతేకాకుండా గత సీఆర్400 మోడల్‌ కంటే అదనంగా 50 కిలోమీటర్ల ఎక్కువ వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ రైలు.. ఇంజిన్‌ పరీక్షల్లో అత్యధికంగా గంటకు 453 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

    ఇదిలా ఉంటే ఇలాంటి హైస్పీడ్ రైళ్లు మాత్రమే కాదు చైనా రక్షణ సామాగ్రిని సైతం అత్యాధునికంగా తయారు చేసుకోవడంలో ముందుంది. 2 రోజుల క్రితమే ఆరో తరానికి చెందినదిగా మరో ఆవిష్కరణను కనుగొన్నారు. అదేంటంటే? జె-36 యుద్ధ విమానాన్ని తయారు చేసింది చైనా. సిచువాన్‌ ప్రావిన్స్‌లోని చెంగ్డూలో ఈ జె-36 ఫైటర్ జెట్‌ను అభివృద్ధి చేశారట. ఈ జె-36 ఫైటర్ జెట్‌కు మూడు ఇంజిన్లు ఉన్నట్టు టాక్. దీన్ని అమెరికాకు చెందిన ఎఫ్‌-35, ఎఫ్‌-22 రాప్టర్లకు ధీటుగా తయారు చేశారు.