https://oktelugu.com/

Today Horoscope In Telugu: ఈ రాశుల వారు ఈరోజు మాట్లాడేటప్పుడు జాగ్రత్త.. ఎందుకంటే?

పెండింగు పనులను పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. బంధువుల నుంచి ధన సహాయము అందుతుంది. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు అప్పుడే జరపొద్దు.

Written By: , Updated On : March 8, 2025 / 08:03 AM IST
Today Horoscope In Telugu

Today Horoscope In Telugu

Follow us on

Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై ఆరుద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో ఆయుష్మాన్ యోగం ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం భరించనుంది. మరికొన్ని రాశుల వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. పిల్లల విషయంలో కొన్ని అశుభ వార్త వినాల్సి వస్తుంది. ఉద్యోగులు కార్యాలయాల్లో ఒత్తిడికి గురవుతారు. జీవిత భాగస్వామి పూర్తి మద్దతుతో వ్యాపాలను అధిక లాభాలు పొందుతారు. ఎవరి వద్దనైనా అప్పు తీసుకున్నట్లయితే ఈరోజు తిరిగి చెల్లించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తారు. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : రాజకీయాల్లో ఉండే వారికి ఈరోజు అనుకూల వాతావరణం. అయితే మాటల్లో మాధుర్యాన్ని కొనసాగించాలి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. బంధువుల్లో ఒకరి కి సాయం చేస్తారు. ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటే వెంటనే తిరిగి చెల్లించాలి. లేకుంటే ఇది భవిష్యత్తులో కష్టం అవుతుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఉద్యోగులు అధికారులతో వాగ్వాదంతో ఉంటారు. అయితే కొందరు స్నేహితుల వల్ల సమస్యలు వెంటనే పరిష్కరించుకుంటారు. గతంలో చేపట్టిన లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే పెద్దల సలహా తీసుకోవాలి. సాయంత్రం బంధువుల్లో ఒకరి ఇంటికి శుభకార్యానికి వెళ్తారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పిల్లలకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలిసి విహార యాత్రలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అయితే తెలియన వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : పెండింగు పనులను పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తారు. బంధువుల నుంచి ధన సహాయము అందుతుంది. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు అప్పుడే జరపొద్దు. ఎందుకంటే ఇది భవిష్యత్తులో తీవ్ర నష్టాలు కలిగిస్తుంది. ఉద్యోగులు పదోన్నతిని పొందుతారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . కుటుంబ సభ్యుల మధ్య భేదాభిప్రాయాలు ఏర్పడతాయి. అయితే మాటల మాధుర్యం కొనసాగించడంతో అందరూ కలిసి పోతారు. పిల్లలు చేసే కొన్ని పనులతో తల్లిదండ్రులు నిరాశ చెందుతారు. అయితే వారిని సక్రమ మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపడతారు. అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులో ఈరోజు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అయితే తెలివితేటలతో వాటిని పరిష్కరించుకుంటారు. ఓ శుభకార్యానికి హాజరవుతారు. వ్యాపారులకు శత్రువుల పేర్ల ఎక్కువగా ఉంటుంది. అయితే మానసికంగా దృఢంగా ఉండడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. సాయంత్రం పాత స్నేహితులను కలుస్తారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కోపాన్ని నియంత్రించుకోవాలి. లేకుంటే సమాజంలో గుర్తింపును కోల్పోతారు. కొత్తగా పెట్టుబడును పెడితే వాటి నుంచి భవిష్యత్తులో అధిక లాభాలు పొందుతారు. కొన్ని పనులు కష్టంగా ఉన్నా వాటిని ఈజీగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారులు అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులకు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : విద్యార్థుల కెరీర్ పై దృష్టి పెడతారు. వ్యాపారులకు అదృష్టం వారిచ్చి లాభాలు పొందుతారు. కొందరు స్నేహితులు ధన సహాయం చేసే అవకాశం ఉంది. డబ్బులు పొదుపు చేయాలి. దుబారా ఖర్చులను నియంత్రించాలి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈరోజు ఈ రాశి వారు చేసే ప్రయత్నాలన్నిటిలో విజయం సాధిస్తారు. సాయంత్రం ఇంటికి అతిథి రావడంతో సందడిగా ఉంటుంది. దీంతో ఖర్చులు కూడా పెరుగుతాయి. పిల్లల కెరీర్ పై దృష్టి పెడతారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్తపెట్టబడలు పెడతారు. వ్యాపారులు జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు..

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులకు నష్టాలు ఉండే అవకాశం. అయితే వీటిని అధిగమించేందుకు తొందరగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. అయినా ఆందోళన చెందకుండా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఉద్యోగులు అధికారుల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటారు.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : మాటల్లో అదుపులో ఉంచుకోకపోతే సంబంధాలు చీలికలు వస్తాయి. ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయి. ఒక ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలి. భవిష్యత్తు గురించి కీలక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల కెరీర్ గురించి తీవ్రంగా చర్చిస్తారు. అయితే వ్యాపారులకు అనుకోకుండా లాభాలు ఉంటాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు.