https://oktelugu.com/

Today Horoscope In Telugu: లక్ష్మీనారాయణ యోగంతో ఈ రాశుల వ్యాపారులకు ఈరోజు అధిక లాభాలు..

విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవారు శుభవార్తను వింటారు. విద్యార్థులు ఇప్పటివరకే ఏదైనా పోటీ పరీక్ష రాసి ఉంటే దానికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు.

Written By: , Updated On : March 6, 2025 / 08:23 AM IST
Horoscope Today(7)

Horoscope Today(7)

Follow us on

Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై రోహిణి నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు బుధుడు శుక్రుడు సంచారం వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. మరికొన్ని రాసిన వారు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు తెలివితేటలు ఉపయోగించి పనులన్నీ చెక్కపెట్టుకుంటారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారులు కొందరి ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు . ఆర్థిక వ్యవహారాల్లో కొత్త వ్యక్తులను అతని నమ్మద్దు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో కొత్త పెట్టుబడును పెడతారు. మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే ఈరోజు ఉపశమనం లభిస్తుంది.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : పూర్వీకుల ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. తల్లిదండ్రుల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. పెండింగ్ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. సోదరుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సాయంత్రం ఒకరి ఇంటికి వెళ్లొచ్చు. మహిళలు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు.

మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విదేశాల్లో చదువుకోవాలి అనుకునేవారు శుభవార్తను వింటారు. విద్యార్థులు ఇప్పటివరకే ఏదైనా పోటీ పరీక్ష రాసి ఉంటే దానికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. జీవిత భాగస్వామి కోసం షాపింగ్ చేస్తారు. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఆర్థికంగా కృంగిపోయే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : తోటి వారి సహాయంతో ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఈరోజు ఏ పని మొదలు పెట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయం కోసం చేసిన ప్రయత్నం సక్సెస్ అవుతుంది. విద్యార్థుల చదువు కోసం చేసిన ఇన్వెస్ట్మెంట్స్ లాభాలు వస్తాయి. పిల్లల కెరీర్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారులు తల్లిదండ్రుల ఆశీర్వాదంతా లాభాలు పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కొందరు వ్యాపారులకు ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలలో జరిపే అవకాశం ఉండదు. కొత్తగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దీంతో మానసికంగా ఆందోళన పెరుగుతుంది. కుటుంబంలో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే వైద్యుడి ని సంప్రదించాలి.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ముఖ్యమైన పనులు వాయిదా వేయడమే మంచిది. కొందరు వ్యాపారులకు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంటుంది. ఆర్థిక సంబంధించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులను సంప్రదించిన తర్వాతే కొత్త ప్రాజెక్టులను ప్రారంభించాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. చట్టపరమైన చిక్కులు ఉంటే ఈరోజుతో పరిష్కారం అవుతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడంలో బిజీగా ఉంటారు.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మనసులో ప్రతికూల ఆలోచనలు రానీయకుండా చూడాలి. మందులతో వాగ్వాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. మానసిక స్థితి ఆందోళనగా ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యం కి హాజరవుతారు. ఆర్థికంగా మిస్సమ్మ ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. కళా రంగానికి చెందినవారు ప్రయోజనాలు పొందుతారు. ఇతరులతో కొన్ని విభేదాలు ఉంటాయి. అప్పు చేసిన వారికి మానసిక ఆందోళన ఉంటుంది. అందువల్ల పాత ఆపులను వెంటనే తీర్చేందుకు ప్రయత్నాలు చేయాలి. వ్యాపారులకు కొన్ని కష్టాలు ఎదురవుతాయి. ఉద్యోగులు అధికారం నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులకు అదనపు ఆదాయం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తియుల విషయంలో శుభవార్తలు వింటారు. మాటల మాధురి అని కొనసాగించాలి. లేకుంటే సమాజంలో గౌరవం పోతుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : వ్యాపారులకు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యుల వారితో వివాదం ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. సాయంత్రం పాత స్నేహితులను కలుస్తారు. బంధువుల నుంచి ఆర్థిక సహాయం పొందుతారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేసే వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగులు కార్యాలయాల్లో అనుకూల వాతావరణాన్ని పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దీంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారం చేసే వ్యక్తులకు ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మందుల నుంచి తన సహాయం అందుతుంది. మీరు కొంత అసౌకర్యాన్ని ఎదుర్కొంటారు. బంధువుల్లో ఒకరితో వివాదం ఉంటుంది. అయితే ఈ సమస్య వెంటనే పరిష్కరించుకుంటారు. మనసుల్లో ప్రతికూల ఆలోచనలు రానీయకుండా చూడాలి.