Today horoscope In Telugu: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై కృత్తిక నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో కొన్ని రాశుల వారికి విష్ణు అనుగ్రహం ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రియమైన వారితో విహారయాత్రలు చేస్తారు. ఉద్యోగులు కష్టపడాల్సి వస్తుంది. అయితే ప్రతిభ ఉన్నవారు పదోన్నతి పొందే మార్గాలు ఏర్పడతాయి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాలు జరిపే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారికి ఈ రోజు ఆదాయాన్ని కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పొదుపు మంత్రం నేర్చుకోవాలి. కొందరు చిక్కుల్లో పడేందుకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త వ్యక్తులను ఎంత మాత్రం నమ్మకుండా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మాటల్లో మధురం ఉండడంవల్ల సమాజంలో గుర్తింపు వస్తుంది. విద్యార్థుల కెరీర్ పైకి ఎలక నిర్ణయం తీసుకుంటారు. పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఇంటికి అతిధులు రావడంతో సందడిగా ఉంటుంది. దీంతో ఉల్లాసంగా ఉంటారు. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అనుకోకుండా వ్యాపారులకు లాభాలు వస్తాయి. ఉద్యోగులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. అనుకున్న ఫలితాలు పూర్తి చేసే వరకు కష్టపడతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వ్యాపారులు కుటుంబంలో కొన్ని ఒడిదొడుగులు ఎదుర్కొంటారు. అందువల్ల మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఉద్యోగులు కార్యాలయాల్లో కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు ఊహించని లాభాలు వచ్చే అవకాశం ఉండదు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు తోటి వారితో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసేవారు కొత్త ప్రాజెక్టుల కోసం వెయిట్ చేయాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తారు. ఉద్యోగులు చేపట్టిన లక్ష్యాలను పూర్తి చేయడంతో సంతోషంగా ఉంటారు. అనుకున్న సమయానికి కావలసిన ధనం అందుతుంది. దీంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పిల్లలతో కలిసి సరదాగా ఉంటారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : లక్ష్యాలను పూర్తి చేయడానికి ఈ రాశి వారు ఇంకా కష్టపడాల్సి వస్తుంది. వ్యాపారులకు కొందరు శత్రువులు ఇబ్బందులు గురిచేస్తారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఓ శుభ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధమవుతారు. ఏ పని చేపట్టిన పూర్తి చేసే వరకు తీవ్రంగా కృషి చేస్తారు..
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : వ్యాపారులు భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థికంగా నష్టానికి గురిచేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారులో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. అయితే ఇంట్లో వారితో ఓ విషయంలో వాగ్వాదం ఉంటుంది.. ఈ సమయంలో మాటలను అదుపులో ఉంచుకోవాలి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టు కోసం పెద్దల సలహా తీసుకుంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. గతంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. బకాయిలన్నీ వసూలు అవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. విద్యార్థులు భవిష్యత్తు కోసం కీలకమైన పరీక్షల్లో పాల్గొంటారు. వ్యాపారులకు అదృష్టం కారణంగా ఘనంగా ధనం చేకూరుతుంది.. ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : వ్యాపారులకు నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం. అందువల్ల ఆచితూచిగా వ్యవహరించాలి. ఖర్చులకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు ప్రణాళిక ప్రకారంగా పనులు చేయడం వల్ల లక్ష్యాలను పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొనడం వల్ల సంతోషంగా ఉంటారు. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. దీంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. ఓ విషయంపై జీవిత భాగస్వామితో చర్చిస్తారు. పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. వాహనాలపై ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.