Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ వంటి ఫ్లాప్ చిత్రం తర్వాత బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ గ్యాప్ లేకుండా కొనసాగుతుంది. గత వారం రోజుల నుండి రామ్ చరణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడు. అయినప్పటికీ కూడా తన తోటి ఆర్టిస్ట్స్ డేట్స్ వృధా కాకూడదని షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఎట్టి పరిస్థితి లో ఈ సినిమా షూటింగ్ ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి అక్టోబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొని రావాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తుండగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఈ చిత్రం లో రామ్ చరణ్ కి గురువు గా నటిస్తున్నాడు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా రామ్ చరణ్ కెరీర్ లో రంగస్థలం ని మించిన హిట్ అవుతుందని బలమైన నమ్మకంతో ఉన్నారు.
ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి రామ్ చరణ్ ఈ మూవీ షూటింగ్స్ సెట్స్ లోకి తన కూతురుతో కలిసి దిగిన ఒక ఫోటో ని తన ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చేసాడు. మా మూవీ షూటింగ్ స్పాట్ కి ఒక చిన్నారి అతిథి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పటి లాగానే ఈసారి కూడా రామ్ చరణ్ తన కూతురు ముఖాన్ని చూపించలేదు. ‘అన్ స్టాపబుల్’ షోకి రామ్ చరణ్ అతిథి గా వచ్చినప్పుడు బాలయ్య ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ ‘మీ కూతురు ముఖాన్ని చూసే అదృష్టం మాకు ఎప్పుడు కల్పిస్తావు’ అని అడగగా, దానికి రామ్ చరణ్ సమాధానం ఇస్తూ ‘సెలబ్రిటీ కూతురు అని తెలిస్తే మా అమ్మాయికి స్వేచ్ఛ ఉండదు. మాకు కలిగిన ఇబ్బంది ఆ అమ్మాయికి కలుగకూడదు. స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళేలాగా ఆ అమ్మాయి పెరగాలి, అందుకే చూపించడం లేదు’ అని చెప్పుకొచ్చాడు.
క్లిన్ కారా పుట్టిన తర్వాత మెగా ఫ్యామిలీ మొత్తానికి ఎన్నో కలిసొచ్చాయి. కానీ రామ్ చరణ్ కి మాత్రం ‘గేమ్ చేంజర్’ రూపం లో కలిసిరాలేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా ఫ్లాప్ అవ్వడం మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. బహుశా గ్లోబల్ వైడ్ గా రామ్ చరణ్ కి పెరిగిన క్రేజ్ ని చూసి కొంతమంది దిష్టి పెట్టడం వల్లే ఇలా జరిగి ఉండొచ్చని అంటున్నారు. ఇకపోతే రామ్ చరణ్ బుచ్చి బాబు తో సినిమా పూర్తి అయ్యాక, సుకుమార్ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డైరెక్టర్ సుకుమార్. పుష్ప సిరీస్ తో అల్లు అర్జున్ ని ఏ స్థాయిలో కూర్చోబెట్టాడో, రామ్ చరణ్ ని అంతకు మించిన స్థాయిలో కూర్చోబెట్టాలని కసిగా ఈ సినిమా స్క్రిప్ట్ ని రాస్తున్నాడు.