https://oktelugu.com/

Today Horoscope In Telugu: ఈ రాశి వ్యాపారులు ఈరోజు నక్క తోకను తొక్కినట్లే.. ఏదంటే అది అవుతుంది..!

Today Horoscope In Telugu ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : March 2, 2025 / 07:54 AM IST
    Horoscope Today

    Horoscope Today

    Follow us on

    Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశరాసులపై ఆదివారం ఉత్తరాషాడ నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఏ సమయంలో కొన్ని రాశుల వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. మరికొన్ని రాసిన వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. మీసం నుంచి మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారంలో భాగస్వాములతో కొత్త ప్రాజెక్టుల గురించి చర్చిస్తారు. అయితే పెద్ద సలహాతోనే నూతన ప్రాజెక్టులు చేపట్టాలి. ఎవరితోనైనా వాగ్వాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. అది కొనసాగితే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.

    వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఉద్యోగులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొన్ని లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంశాలు పొందుతారు. పదోన్నతులకు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంటుంది. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన విషయం గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. కొత్త ప్రాజెక్టులు చేపట్టే ముందు పెద్దల సలహా తీసుకోవాలి.

    మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఈ రంగానికి చెందిన వారు కూడా అనేక ప్రయోజనాలు పొందుతారు. ప్రియమైన వ్యక్తుల కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. అయితే ఈ విషయాలను ఎవరితో పంచుకోవద్దు. కొత్త వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలు జరపకుండా ఉండాలి. కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండే అవకాశం ఉంది. మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది.

    కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : వ్యాపారులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇలా అధిక లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల కోసం బహుమతులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం దక్కుతుంది. పోటీ పరీక్షలో పాల్గొనే విద్యార్థులు సక్సెస్ అవుతారు. ప్రయాణాలకు దూరంగా ఉండాలి. పెండింగ్ బకాయిలన్నీ పూర్తి చేస్తారు.

    సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగులు కార్యాలయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా వివాదం ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలి. ఇది కొనసాగితే భవిష్యత్తులో ఆందోళనకు గుర అయ్యే అవకాశం ఉంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. సోదరుల వివాహం కోసం తీవ్రంగా కృషి చేస్తారు.. జీవిత భాగస్వామిగా వ్యాపారం చేసే వారికి లాభాలు ఎక్కువగా ఉంటాయి.

    కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఆరోగ్యం పై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాటులను నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు సాగుతారు. అయితే ఇవి భవిష్యత్తులో లాభాలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

    తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తులా రాశి వారికి ఈరోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు లేదంటే అది పూర్తవుతుంది. విద్యార్థుల పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగుల లక్ష్యాలను పూర్తి చేయడంతో సత్కరించబడతారు. బంధువుల నుంచి శుభవార్తలో వింటారు. తల్లి ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వ్యాపారులకు లాభాలు ఉంటాయి.

    వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : విహారయాత్రలకు వెళ్లాలని ప్లాన్ చేసేవారికి అనుకూలమైన రోజు. అయితే ఈ సమయంలో విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది అందువల్ల దీనిని నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. విదేశాలలో వ్యాపారం చేసే వారికి శుభవార్తలు అందుతాయి. విద్యార్థుల భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకుంటారు.

    ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులకు ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. ఉద్యోగులకు ప్రశంసలు దక్కుతాయి. కుటుంబంలో వివాదాలు తలెత్తినా వెంటనే పరిష్కరించబడతాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే దానిని తిరిగి పొందేందుకు అవకాశం ఉంటుంది. బంధువుల నుంచి ధన సహాయం పొందుతారు.

    మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు కొన్ని కార్యక్రమాలలో బిజీగా ఉంటారు. గతంలో ఉన్న సమస్యలకు నేటితో పరిష్కారం అవుతుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదు అందువల్ల ఇలాంటి కార్యక్రమాలను వాయిదా వేసుకోవడం మంచిది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తుంటాయి.

    కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ప్రశాంత వాతావరణ ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తను వింటారు. వ్యాపారులు ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. ఒత్తిడి కారణంగా మనసు ఆందోళనగా ఉంటుంది. ఇలాంటి సమయంలో కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ విషయంలో పెద్దల సలహా తీసుకోవాలి.

    మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : అనారోగ్యాలతో గురైన అవకాశం ఉంది. అందువల్ల నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉద్యోగులు పదోన్నతి గురించి శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. విహారయాత్రలకు వెళ్లాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశం.