Kumbh Mela 2025: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా. 144 ఏళ్ల(144 Years) తర్వాత వచ్చిన ఈ కుంభమేళాను అత్యంత పవిత్రంగా భావిస్తున్నారు. పుష్యపౌర్ణమి రోజు(జనవరి 13న) కుంభమేళా అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర్ణమి రోజు రవి, ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజున ప్రయాగ్‌రాజ్‌లో పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. రెండు రోజులుగా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. మంగళవారం మకర సంక్రాంతి పురస్కరించుకుని వివిధ అఖాడాల నుంచి వేలాదిగా సాధవులు తొలి పుణ్యస్నానాలు ఆచరించారు. వేకువజామున 3 గంటలకు బ్రహ్మముహూర్త ఉండడంతో పుణ్యస్నానాలు ప్రారంభమయ్యాయి. ఈ ఒక్కరోజే దాదాపు 3.5 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివచ్చినట్లు యూని సర్కార్ వెల్లడించింది.
సాధవుల సామూహిక స్నానం..
144 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలకు ప్రత్యేక స్థానం ఉంది. అందుకే పెద్ద సంఖ్యలో వివిధ అఖాడాల(Akhadas) నుంచి నాగసాధువులు తరలివచ్చారు. సామూహిక స్నానాలు ఆరచించారు. కుంభమేళా సమయంలోనే వారంతా దర్శనమిస్తారు. ఈ క్రమంలోనే ఒంటినిండా విభూది పూసుకుని ఈటెలు, త్రిశూలాలు చేతబట్టుకుని వచ్చారు. డమరుక నాదాల నడుమ వేల మంది నాగసాధువులు ఊరేగింపుగా ప్రయాగ్‌రాజ్ చేసుకున్నారు. గడ్డకట్టే చలిలో తెల్లవారుజామున 3 గంటలకు పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తొలుత పంచాయతీ అఖాడా మహానిర్వాణి, శంభు పంచాయతీ అటల్ అఖాడాకు చెందిన సాధువుల స్నానమాచరించారు. మహా కుంభమేళాలో 13 అఖాడాలు పాల్గొంటున్నాయి. సాధువలంతా ఒకేసారి రావడంతో యూపీ ప్రభుత్వం హెలికాప్టర్ల ద్వారా భక్తులపై పూలవర్షం కురిపించింది.
యాత్రీకులకు ప్రత్యేక వసతి..
ఇదిలా ఉంటే కుంభమేళాలో పాల్గొనేందుకు ప్రయాగ్‌రాజ్ వస్తున్న యాత్రీకుల కోసం యూపీ ప్రభుత్వంతోపాటు నదీతీరాల్లో ప్రైవేటుగా కూడా పెద్ద ఎత్తున వసతి ఏర్పాటు చేశారు. ఈ వసతి సదుపాయాల అద్దె మాత్రం భారీగా ఉంది. ఒక లగ్జరీ టెంట్‌కు రాత్రికి సుమారు రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నగరంలోని హోటళ్లలో కూడా ఒక రాత్రికి రూ.లక్ష వరకు అద్దె తీసుకుంటున్నారు. నగరంలోని హోటళ్లలో ఒక రాత్రికి రూం రెంట్ రూ.20 వేలు ఉంది. ఐఆర్‌సీటీసీ టెంట్ సిటీలో మాత్రం తక్కువ ధరకే లభిస్తున్నాయి. ఇక్కడ రేట్లు రాత్రి వసతికి రూ.1,500 నుంచి ప్రారంభమవుతున్నాయి. ప్రయాగ్‌రాజ్ క్యాంపులో 40 లగ్జరీ టెంట్లు కూడా ఏర్పాటు చేసింది. ఈ టెంట్లలో సూట్ బాత్‌రూంలు, వేడి, చల్లనీరు, ఆన్‌సైట్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఈ క్యాంపు సైట్‌లో వసతికి ఒక రాత్రికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు.