Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశరాశిలపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉండనుంది ఇదే రోజు బుధాదిత్య యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు ఉండలు ఉన్నాయి. మరికొన్ని రాశుల వారు వారు ప్రయాణాలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి.
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు ఈ రోజు కొంత నిరాశతో ఉంటారు. కొన్ని పనులను వాయిదా వేసుకోవడం మంచిది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటే ఇది మంచి సమయం కాదు. కొందరు శత్రువులు ఈ రాశి వారి పట్ల అనసూయ పడవచ్చు. సాయంత్రం పిల్లలతో సరదాగా ఉండేందుకు ప్రయత్నించండి. జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దిగకుండా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. పాత స్నేహితులను కలవడం వల్ల ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు వస్తాయి. సాయంత్రం ఇంటికి అతిధి రావడం వల్ల సందడిగా ఉంటుంది. కొందరు శత్రువులు ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): పూర్వీకుల ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. వాహనాలపై వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఖర్చులు మితిమీయకుండా చూసుకోవాలి. జీవిత భాగస్వామి మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడతారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈ రోజు సంతోషంగా గడుపుతారు. బంధువుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు అందుకుంటారు. పిల్లల కెరీర్ పైకి ఇలాగ నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ఆరోగ్యం పై దృష్టి పెట్టాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయం వలన ఇబ్బందులు తలెత్తే అవకాశం.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : విహారయాత్రలు చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని మొదలుపెట్టిన పూర్తి చేసే వరకు విడిచిపెట్టరు.. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ పొందే అవకాశాలు. వ్యాపారులకు ఊహించని లాభాలు. శుభకార్యానికి అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటారు. కొన్ని పనుల కారణంగా బిజీగా ఉంటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : మాటలను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థులు పరీక్షల్లో పాల్గొన్నట్లయితే రాణిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఆర్థికంగా మెరుగుపడతారు. ఏ పని చేసిన పూర్తి చేసే వరకు విడిచిపెట్టారు. సాయంత్రం జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దూరంగా ఉండాలి. ఓ పని కోసం బిజీగా మారుతారు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే ఆలోచించాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల సలహాతో కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులు ప్రమోషన్ పొందడానికి మార్గాలు ఉంటాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : తల్లిదండ్రుల ఆశీర్వాదంతో కొత్తపెట్టబడులు పెడతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థుల పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై నిర్లక్ష్యంగా ఉండొద్దు. సాయంత్రం స్నేహితులను కలవడంతో మనసు ప్రశాంతంగా ఉంటుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : శారీరక సమస్యలు వచ్చే అవకాశం. అందువల్ల వైద్యులను సంప్రదించి పరిష్కరించుకోవాలి. వాహనాలపై అనుకోకుండా ప్రయాణాలు చేస్తారు. పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఇతరులతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి. సోదరులతో వివాదాలు ఉంటే నేటితో పరిష్కారం అవుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారులు శుభవార్తలు వింటారు. ముఖ్యమైన సమాచారం కోసం ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అదనపు ఆదాయం చేకూరుతుంది.