Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశరాశులపై చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు శుక్రుడు మీన రాశిలో ప్రయాణిస్తాడు. దీంతో కర్కాటక రాశితో సహా మరికొన్ని రాశులు ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి ఉద్యోగులు జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో వాగ్వాదం ఉంటుంది. మాటలను అదుపులో ఉంచుకోవాలి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. వ్యాపారులో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. సీనియర్ల నుంచి వేధింపులు ఉండే అవకాశం ఉంది. ఓ ప్రాజెక్టులో పని చేసేవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి అనుకూలమైన రోజు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): చిరు వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు ఉంటాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టడం వల్ల లాభాలను అధికంగా పొందుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరితో వాగ్వాదం ఉంటుంది. అయితే మాటలను అదుపులో ఉంచుకోవడం వల్ల పరిష్కారం అవుతుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. వాహనాలపై ప్రయాణాలు చేసి ఉద్యోగం చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వ్యాపారులకు కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. రాజకీయ రంగాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు పెరుగుతుంది. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు ఊహించిన లాభాల కంటే ఎక్కువగా పొందుతారు. విమర్శలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లాలి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో జరిగే ఓ శుభకార్యం గురించి చర్చిస్తారు. ఏ పని చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. అర్హులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు. ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి వస్తే వెంటనే వసూలు చేసుకోవడం మంచిది. లేకుంటే ఏమీ తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ప్రణాళికలు చేపడుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : కష్టపడి పనిచేసిన వారికి సరైన ఫలితం అందుతుంది. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కొన్ని ప్రతికూల పరిస్థితులు ఏర్పడిన చాకచక్యంగా వ్యవహరించడంతో ముందుకు వెళ్తారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ స్నేహితుల ద్వారా ధర సహాయ మండుతుంది. కాన్ కరోనా తీసుకునే వారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు పోటీ పరీక్షలకు దూరంగా ఉండటమే మంచిది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ వాతావరణ ఆందోళనకరంగా ఉంటుంది. ఇతరులకు ధన సహాయం చేస్తారు. కొందరు విమర్శలు చేసే అవకాశం ఉంది. అయితే ఓపికతో ముందుకు వెళ్లాలి. స్నేహితుల కోసం సమయానికి కేటాయిస్తారు. దూర ప్రయాణాలు అసలే చేయొద్దు. ఉద్యోగులు అధికారుల నుంచి ఓ సమాచారాన్ని పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగులు జీతం పెరిగే విషయం గురించి చర్చించుకోవచ్చు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వ్యాపారులకు కొందరు అడ్డంకులు సృష్టించడానికి రెడీ అవుతారు. అయితే వారిని ఎదుర్కోవడానికి ముందుకు వెళ్తారు. దైవదర్శనాలు చేస్తారు. కుటుంబ సభ్యులకు సమయానికి కేటాయించాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఉండే సమస్యలపై దృష్టి పెట్టాలి. ఆస్తి విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారులు మిశ్రమ లాభాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు ఉంటాయి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు విజయం సాధిస్తారు. ఇతరులతో వాగ్వాదం అంత మంచిది కాదు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఏ చిన్న సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి కృషి చేస్తారు. బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఇతరులకు సాయం చేసేందుకు ముందుకు వస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. విమర్శల విషయంలో తిప్పికొట్టాలి. మౌనంగా ఉండడం వల్ల ఇంకా ఇబ్బందులు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. వ్యాపారులు మిశ్రమ లాభాలు పొందుతారు. గతంలో కంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : స్థిరాస్తి కొనుగోలు విషయంలో ప్లాన్ చేస్తారు. అయితే కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి. వ్యాపారులు కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారం మెరుగుపడుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. పిల్లల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తను వింటారు. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : వ్యాపారాలు కొన్ని కార్యక్రమాల వల్ల బిజీగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే కష్టపడడం ద్వారా విజయం సాధిస్తారు. ఆరోగ్యం పై ఆందోళన వాతావరణం ఉంటుంది. పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు. బకాయిలు వసూలు అవుతాయి. స్నేహితులతో సరదాగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు