Today Horoscope In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే రోజు సూర్యుడు,శని, బుధుడు కలయిక ఉండనుంది. దీంతో కొన్ని రాశుల వారికి అనుకొని అదృష్టం వరించానుంది. మరికొన్ని రాశుల వారు స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారు కష్టపడి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే అనుకున్న పనులు పూర్తికాక పోవడంతో మనసు ఆందోళనగా ఉంటుంది. వ్యాపారులకు కొన్నిచికాకులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకుండా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయం జాగ్రత్తగా ఉండాలి.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభించేముందు పెద్దల సలహా తీసుకోవాలి. ముఖ్యమైన సమాచారం ఇతరులతో పంచుకోకుండా ఉండాలి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. సకాలంలో పనులు పూర్తి చేయడం వల్ల ప్రశంసలు దక్కుతాయి. కుటుంబ సభ్యులతో చిన్న వాగ్వాదం ఉంటుంది. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది. పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): బంధువులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలపై భాగస్వాములతో వ్యాపారాలు చర్చిస్తారు. ఓ ప్రాజెక్టు చేపట్టడం ద్వారా బిజీ లైఫ్ తో గడుపుతారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిపై కోపం తెచ్చుకుంటారు. అయితే ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకోవాలి. లేకుంటే బంధాలు చీలిపోతాయి. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : మాటలను అదుపులో ఉంచుకోవాలి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. వీరితో వ్యాపారం చేసే టప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో వ్యాపారం చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయం. ఉద్యోగులు కొన్ని పనులను పూర్తి చేయడంలో కష్టపడాల్సి వస్తుంది. అయితే ఒక అధికారి సాయంతో వెంటనే పూర్తి చేయగలుగుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : పెండింగ్ పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో వైద్యులను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. కొందరు ప్రత్యర్థులు వ్యాపారులకు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల ఆర్థిక వ్యవహారాలను ఇతరులతో పంచుకోకుండా ఉండడమే మంచిది. వ్యాపారులకు అనుకొని సంఘటన వల్ల లాభాలు తగ్గుతాయి. ఉద్యోగులు కొన్ని పనులు పూర్తి చేయడానికి ఇతరులపై ఆధార పడాల్సి వస్తుంది.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఉద్యోగాన్ని మార్చాలనుకునే వారికి ఇదే మంచి సమయం. మానసికంగా కాస్త ఆందోళనగా ఉంటారు. వ్యాపారాలు అనుకున్న లాభాలను పొందలేరు. మాటల కారణంగా కుటుంబ సభ్యుల్లో ఒకరు బాధపడుతారు. ఆ తర్వాత వారిని చేరదీయడం వల్ల బంధాలు బలపడతాయి. లేకుంటే నష్టం జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. విదేశాల్లో ఉండే వారి నుంచి శుభవార్తలు వింటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : తండ్రి సలహాలతో వ్యాపారాలు కొత్త పెట్టుబడులు పెడతారు. ఇంట్లో జరిగే కొన్ని వాగ్వాదాల విషయంలో మౌనంగా ఉండడమే మంచిది. స్నేహితుల వద్ద ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మోసపోయే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలకు దూరంగా ఉండడమే మంచిది. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తలు తీసుకోవాలి.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు. ఇంట్లో అశాంతి నెలకొంటుంది. అయితే దీని పరిష్కారానికి భాగస్వామి మద్దతు ఉంటుంది. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగులు రిస్కుతో కూడుకున్న పనులు చేయాల్సి వస్తుంది. లక్ష్యాన్ని పూర్తి చేస్తే ప్రశంసలతో పాటు పదోన్నతులు కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయి.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఉద్యోగులు తోటి వారితో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారి కోసం కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు శత్రువుల బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో వీరు ఆశించిన లాభాలు పొందలేక పోతారు. అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి వచ్చే లాభాలతో కాస్త రిలాక్స్ అవుతారు. సమాజంలో గౌరవం పొందుతారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈ రోజు అనుకోని అదృష్టం వరిస్తుంది. ఉద్యోగులు కొత్త ఉద్యోగానికి మారాలంటే ఇదే మంచి సమయం. వ్యాపారులు కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులతో కలిసి ప్రయాణాలు చేస్తారు. వాహనాల పై వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. వ్యాపారులకు కొందరు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంది. అయితే భాగస్వాముల సహకారంతో వారిని ఎదుర్కొంటారు. బిజీ షెడ్యూల్ కారణంగా ప్రియమైన వారితో గడపలేక పోతారు. దీంతో వారితో దూరం పెరుగుతుంది. పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : విదేశాల్లో ఉండేవారి నుంచి ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి షాపింగ్ చేస్తారు. ఎలాంటి సమస్యనైనా వెంటనే పరిష్కరించుకుంటారు. అయితే కొన్ని పనులను వాయిదా వేసి విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఉద్యోగులు కొత్త సవాలను ఎదుర్కొంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.