Horoscope Today(4)
Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశరాసులపై పునర్వసు నక్షత్ర ప్రభావం ఉండనుంది. ఇదే రోజు ప్రీతియోగం ఏర్పడనుంది. దీంతో రాశి వారికి ఊహించని ధన లాభం ఉండరు ఉంది. మరికొన్ని రాసిన వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : ఈ రాశి వారికి ఈ రోజు బంధువుల నుంచి ధన సహాయం అందుతుంది. ప్రత్యర్థులు దెబ్బతీసేందుకు ఊహాలు పన్నుతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. శుభవార్తలు వింటారు. విదేశాల్లో ఉండేవారి నుంచి ఓ కీలక సమాచారం అందుతుంది.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) ఈ రాశి వారికి గతంలో జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటే ఈరోజుతో సమసిపోతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణ లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రపంచంలో అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు పదోన్నతి పొందేందుకు మార్గం ఏర్పడుతుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇంట్లో సోదరీ సోదరీమణుల కోసం తీవ్రంగా కష్టపడతారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉండే అవకాశం. నువ్వు అలా మాటలను అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : గతంలో పెట్టుబడి పెట్టిన వారు ఇప్పుడు లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. మనసులో వచ్చే ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఆరోగ్యంలో కొంచెం క్షీణత ఏర్పడే అవకాశం. కుటుంబ సభ్యులతో సమస్యలు ఉంటాయి. వ్యాపారాలు ఒడిదడుగులు ఎదుర్కొంటారు. ఉద్యోగులకు సీనియర్ల నుంచి వేధింపులు ఉంటాయి. అయితే విద్యార్థుల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. జీవిత భాగస్వామితో వాగ్వాదానికి దూరంగా ఉండాలి.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : పెండింగ్ సమస్యలను పరిష్కరించుకుంటారు. కుటుంబంలో ఒకరితో వివాదం ఏర్పడుతుంది. మాటలను అదుపులో ఉంచుకోకపోతే మరింత సమస్య ఏర్పడే అవకాశం. వ్యాపారులకు ఊహించని లాభాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : జీవిత భాగస్వామితో వాదనలు ఉంటాయి. కొన్ని పనులు ఎంత కష్టపడినా పూర్తి కావు. దీంతో మానసికంగా ఆందోళన చెందుతారు. విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకోవాలంటే తీవ్రంగా కృషి చేయాల్సి ఉంటుంది. పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. అవసరమైన ధనం అందుతుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ప్రత్యర్థులు ఎన్ని ఊహాలు పనినా వాటిని దాటుకుంటూ ముందుకెళ్తారు. ఉద్యోగులకు పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యలో రాణిస్తారు. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో వ్యాపారులు ఉత్సాహంగా ఉంటారు.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారాలు కీలక నిర్ణయం తీసుకుంటారు. మానసికంగా ఆందోళన ఉంటుంది. ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు మద్దతుగా ఉండాలి. కొన్ని ఆలోచనల వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. సాయంత్రం స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : మకర రాశి వారికి ఈ రోజు ఊహించని ధరలాపం ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు. విద్యార్థులు ఏ పోటీ పరీక్షల్లో పాల్గొన్న విజయం సాధిస్తారు. పిల్లల కెరీర్ పై ఒక సమాచారం అందడంతో ఆ నిర్ణయం తీసుకుంటారు. ఒక పనిని ప్రారంభించే ముందు పెద్దల సలహా తీసుకోవడం మంచిది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : కొత్త పెట్టుబడులు పెట్టే వారికి ఈరోజు అనుకూలం. జీవిత భాగస్వామితో వాదనలు ఉంటే వెనక్కి తగ్గాలి. కొత్త వ్యక్తులను ఎవరిని నమ్మొద్దు. ఎవరికైనా అప్పు ఇవ్వాల్సి వస్తే వెనుకాడడం మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. కొన్ని పనుల కోసం రిస్క్ తీసుకుంటారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : తల్లిదండ్రుల ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యంలో కొంచెం క్షీణత ఉంటుంది. ఓ వివాహ కార్యక్రమం కోసం బిజీగా మారుతారు. వ్యాపారులకు అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో అధిక లాభాలు పొందుతారు. ఉద్యోగులు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.