Today Horoscope In Telugu: గ్రహాల మార్పుతో కొన్ని రాశులపై ప్రభావం ఉండనుంది. ఇందులో భాగంగా శనివారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్రపద నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో శస్యోగం ఏర్పడడంతో కొన్ని రాశులపై ప్రభావం ఉంటుంది. వీరికి శని దేవుడి అనుగ్రహం లభించనుంది. మరికొన్ని రాసిన వారు జాగ్రత్తగా ఉండాలి. వేషంతో సహా మీనం వరకు మొత్తం రాసిన ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి, కృత్తిక 1) : వ్యాపారులు ఊహించని లాభాలు పొందుతారు. జీవిత భాగస్వామి మద్దతుతో కొత్తగా పెట్టుబడును పెడతారు. మిగతా రోజుల్లో కంటే ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కత్తుల విషయంలో ప్రణాళిక వేసుకోవాలి. పెండింగ్ లో ఉండే పనులు పూర్తి చేస్తారు. దీంతో ప్రశాంతంగా ఉంటారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : వివాహ ప్రతిపాదనలు వస్తాయి. పెద్దల అంగీకారంతో కొన్ని పనులు పూర్తి అవుతాయి. ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేయడం వల్ల పదోన్నతులు పొందుతారు. రాజకీయ రంగానికి చెందినవారు ఉల్లాసంగా ఉంటారు. కుటుంబంలో సంతోషం వెళ్లి విరిస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): పిల్లల చదువుపై శుభవార్తలు వింటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విదేశాల్లో ఉండేవారి నుంచి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈరోజు అకస్మాత్తుగా పెద్ద మొత్తంలో ధనం సమకూరుతుంది. విద్యార్థులు ఏకాగ్రతతో పోటీపరీక్షల్లో పాల్గొంటే విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో వ్యాపారాలు అదరపు ఆదాయాన్ని పొందుతారు. జీవిత భాగస్వామి మద్దతుతో కొన్ని పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. స్నేహితుల సహాయంతో లక్షాలను పూర్తి చేస్తారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఉద్యోగులు కార్యాలయంలో శుభ ఫలితాలు పొందుతారు. అధికారుల నుంచి ఉండే ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. రాజకీయ నాయకులకు అనుకూల సమయం ఉంటుంది. వ్యాపారులో ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. పెండింగ్ పనులు సకాలంలో పూర్తి చేస్తారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : జీవిత భాగస్వామితో వ్యాపారం చేసే వారికి అనుకూల సమయం. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో వివాదం ఉంటే నేటితో పరిష్కారం అవుతుంది. విద్యార్థుల్లో ఉన్నత విద్యకు సంబంధించి శుభవార్తలు వింటారు.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాత బకాయిలను తీరుస్తారు. కొన్ని విషయాల్లో వివాదాలు తలెత్తాయి. అందువల్ల మాటలను అదుపులోకి ఉంచుకోవాలి. పెండింగ్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : కొందరు ఈ రాశి వారిని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారు. అందువల్ల కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులకు కోసం కొన్ని పనులు చేస్తారు. దీంతో బిజీ వాతావరణం గడుపుతారు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అత్యధిక లాభాలు వచ్చే అవకాశం.
ధనస్సు రాశి( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : వ్యాపారులకు ప్రత్యర్థుల బెడద ఉంటుంది. అందువల్ల ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్లాలి. ఎవరికైనా రుణం ఇవ్వాలని ఆలోచిస్తే తొందరపడొద్దు. పందుల నుంచి అధిక రుణాన్ని పొందుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : నిరుద్యోగులకు ఆదాయం లభిస్తుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. స్నేహితుల్లో ఎవరైనా సాయం చేస్తే జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : భవిష్యత్తులో దృష్టిలో ఉంచుకొని కొత్త పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులతో విహారయాత్రలకు వెళ్తారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. జీవిత భాగస్వామి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం పై జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఎవరికైనా డబ్బు ఇవ్వాలని ఆలోచిస్తే వెంటనే మానుకోవాలి. వైవాహిక జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. పిల్లల భవిష్యత్తుపై ఎలక నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగంలో లక్ష్యాలను పూర్తి చేయడంతో అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు.