Pushpa 2 : నెట్ ఫ్లిక్స్ లో ఒక సినిమా విడుదలైన 24 గంటలోపే టాప్ లో ట్రెండింగ్ అవ్వడం ఎప్పుడైనా చూసారా..?, ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా టాప్ 10 ట్రెండింగ్ లోకి రావాలంటే కనీసం రెండు రోజుల సమయం కావాలి. కానీ పుష్ప 2 చిత్రం 18 గంటలకే టాప్ 1 లోకి వచ్చేసింది. థియేటర్స్ లో ఆడియన్స్ ఒక రేంజ్ లో ఇరగబడి చూసారు. కేవలం బుక్ మై షో యాప్ నుండే ఈ సినిమాకి ఆరు కోట్ల టిక్కెట్లు అమ్ముడుపోయాయి. నార్త్ ఇండియన్స్ అయితే ఇప్పటికీ ఈ చిత్రాన్ని థియేటర్స్ లో చూస్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఓటీటీ లోకి వదిలేశారు. థియేటర్స్ లో జనాలు అంతలా చూసారు కదా, ఇక ఓటీటీ లో మళ్ళీ ఎవరు చూస్తారులే, అసలే మూడు గంటలకు పైన నిడివి ఉన్న సినిమా అని అందరూ అనుకున్నారు.
కానీ ఓటీటీ లో ఇంతటి అద్భుతమైన సెన్సేషనల్ రెస్పాన్స్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కేవలం ఇండియా లో మాత్రమే కాదు, పాకిస్థాన్, బాంగ్లాదేశ్, బెహ్రెయిన్, మాల్దీవ్స్, ఒమెన్, శ్రీలంక, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, కెన్యా, యునైటెడ్ కింగ్డమ్, క్వాటర్ ఇలా అన్ని దేశాల్లోనూ ఈ చిత్రం నెంబర్ 1 స్థానం లో కొనసాగుతుంది. ఇది సాధారణమైన విషయం కాదు. అల్లు అర్జున్ కి గ్లోబల్ వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పడానికి ఈ ట్రెండ్ ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. ముఖ్యంగా పాకిస్థాన్ దేశం లో ఈ చిత్రాన్ని ఎగబడి చూస్తున్నారు. అక్కడ ఈ సినిమా టాప్ 1 స్పాట్ లో ట్రెండ్ అవ్వడం గమనార్హం. బాలీవుడ్ లో కొంతమంది హీరోలతో పాటు, మన టాలీవుడ్ లో అల్లు అర్జున్, ప్రభాస్ వంటి సూపర్ స్టార్స్ కి మొదటి నుండి పాకిస్థాన్ లో మంచి క్రేజ్ ఉంది.
ఒకప్పుడు వీళ్ళ సినిమాలు అక్కడి థియేటర్స్ లో కూడా విడుదల అయ్యేవి. ఇదంతా పక్కన పెడితే హిందీ ఆడియన్స్ కి పుష్ప 2 సినిమా ఒక వ్యసనం లాంటిది. అక్కడి ఆడియన్స్ ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే ఇంకా వదలలేదు. ఇక ఓటీటీ లో వదులుతారా..?, #RRR చిత్రం నెట్ ఫ్లిక్స్ లో ఏడాదికి పైగా టాప్ 10 లో ట్రెండ్ అవుతూ వచ్చింది. అలా ‘పుష్ప 2 ‘ కూడా ట్రెండ్ అవుతుందో లేదో చూడాలి. #RRR చిత్రాన్ని మన ఇండియన్స్ మాత్రమే కాకుండా, వెస్ట్రన్ దేశాలకు చెందిన వాళ్ళు కూడా ఎగబడి చూసారు. ఫలితంగా ఆ చిత్రం ఆస్కార్స్ కి కూడా ఎంపికై అవార్డుని కైవసం చేసుకుంది. పుష్ప మొదటి భాగంతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డుని అందుకున్న అల్లు అర్జున్, పుష్ప 2 కి ఆస్కార్ వరకు వెళ్తాడా లేదా అనేది చూడాలి.