Somu Veerraju: ఏపీలో బీజేపీ బలోపేతంపై సోము వీర్రాజు ద్రుష్టిపెట్టారా? బూత్ స్థాయి నుంచి పటిష్టపరచడానికి నిర్ణయించారా? ప్రతీ అయిదు బూత్ కమిటీలను శక్తి కేంద్రాలుగా మార్చనున్నారా? రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల శక్తి కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా ఎన్నికల సమరశంఖం పూరించనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర బీజేపీలో హేమాహేమీ నాయకులు ఉన్నారు. ప్రతీ జిల్లాలో బలమైన కేడర్ సైతం ఉంది. అయితే తెలంగాణాతో పోల్చితే ఏపీలో పార్టీ బలీయమైన శక్తిగా ఎదగడం లేదు. దీనికి అనేక కారణాలున్నాయి. రాష్ట్ర బీజేపీలో ఒక విధంగా చెప్పాలంటే సోము వీర్రాజు గట్టి పోరాటమే చేస్తున్నారు.
Somu Veerraju
ప్రస్తుతం బీజేపీలో జగన్, చంద్రబాబును అభిమానించే నాయకులు ఉన్నారు. కమ్మ సామాజికవర్గ నాయకులు చంద్రబాబు, రెడ్డి సామాజికవర్గీయులు జగన్ కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ ఎప్పటి నుంచో నడుస్తోంది. వారి రాజకీయ లబ్ధికి తహతహలాడుతున్నారు తప్పించి బీజేపీ బలోపేతానికి ద్రుష్టిసారించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఏపీ బీజేపీలో ఆర్ఎస్ఎస్ నుంచీ పనిచేసి వచ్చిన వారే కాస్తా చురుగ్గా ఉన్నారు. పార్టీ భావజాలంతో పనిచేస్తున్నారు. చాలామంది మాత్రం రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక లేక..కేంద్ర ప్రభుత్వం అండ కోసం పార్టీలో చేరారు. అటువంటి వారితోనే ఇప్పుడు పార్టీ రాష్ట్ర నాయకత్వానికి చిక్కొచ్చి పడింది. ఇక సామాజికవర్గపరంగా కూడా ప్రస్తుతం బీజేపీకి కాపులు, క్షత్రియులు అండగా ఉన్నారు. సోము వీర్రాజుకు రాష్ట్ర నాయకత్వం అప్పగించిన తరువాత కాపులు బీజేపీ వైపు చూడడం ప్రారంభించారు.
Also Read: Flop Cars In India: దేశంలో విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన కార్లు ఏంటో తెలుసా?
చాలామంది నాయకులు పార్టీలో చేరికకు మొగ్గుచూపుతున్నా.. పార్టీలో జగన్, చంద్రబాబు అనుకూల నాయకులు అడ్డుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది. ఆది నుంచి కొనసాగుతున్న బీజేపీ నాయకులు స్థిరంగా ఉండగా.. చంద్రబాబు, జగన్ అనుకూల నాయకులు రెండు కుంపట్లుగా కొనసాగుతున్నారు. కానీ వీరి చేరిక విషయంలో కేంద్ర పెద్దల ప్రమేయం ఉండడంతో రాష్ట్ర నాయకత్వం కూడా ఏం చేయలేని నిస్సహాయ స్ధితిలో ఉంది. ఈ రెండు వర్గాలు సోము వీర్రాజుకు అసలు సహకరించడం లేదన్న టాక్ రాజకీయవర్గాల్లో చక్కర్లు కొడుతోంది. అందుకే తెలంగాణాలతో పోల్చుకుంటే ఏపీలో బీజేపీ వెనుకబడి ఉంది. దీనికి కారణం బీజేపీలో కొంతమంది నాయకులు సోము వీర్రాజుకు సహాయ నిరాకరణ చేస్తుండడమే.
శక్తి కేంద్రాల ఏర్పాటులో..
కానీ ఇవేవీ పట్టించుకోకుండా సోము వీర్రాజు ఏపీలోపార్టీని బలోపేతం చేయడంపైనే కాన్షంట్రేషన్ చేశారు. శక్తికేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీలో కేంద్ర నాయకత్వం సైతం బూత్ కమిటీలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. నేరుగా పార్టీ అధ్యక్షుడు బూత్ కమిటీలతో టచ్లో ఉంటారు. వారు ఎక్కడుకు వెళ్లినా బూత్ కమిటీలతో సమావేశం కాకుండా ఉండరు. కేంద్ర నాయకత్వం పోలింగ్ బూత్ కేంద్రంగానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే పార్టీ శ్రేణులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోము వీర్రాజు శక్తికేంద్రాల ఏర్పాటును టార్గెట్గా పెట్టుకున్నారు. రానున్న రోజుల్లో 15 వేల శక్తి కేంద్రాల్లో పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని లక్ష్యంతో పని ప్రారంభించారు. ముందుగా జోనల్ సమావేశాలు చురుగ్గా నిర్వహిస్తున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు నాలుగు జోన్ల సమావేశాలు నిర్వహించి పార్టీ స్థితిగతులను ఆరా తీయనున్నారు.
Somu Veerraju
బాధ్యులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయనున్నారు. ఇప్పటికే రాయలసీమ, ఉత్తరాంధ్రలో రాజకీయ పర్యటనలు షురూ చేసిన వీర్రాజు ఇప్పుడు కొస్తా జిల్లాలో పర్యటనలకు సైతం ప్రణాళిక రూపొందించారు. ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టుల సందర్శన పేరుతో చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభించింది. మూడు రోజుల పాటు సోము వీర్రాజు బ్రందం ప్రతీ ప్రాజెక్టును సందర్శించి రైతులు, నిర్వాసితుల సమస్యలు తెలుసుకున్నారు. అటు ప్రభుత్వంపై కూడా ఒత్తడి పెరిగింది. పెండింగ్ పనులు పునరావాసం, పరిహారం వంటి విషయాల్లో కదలిక వచ్చింది.
బీజేపీలో చేరడానికి రాష్ట్ర వ్యాప్తంగా చాలా నాయకులు సిద్ధంగా ఉన్నారు. సోము వీర్రాజు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తరువాత చేరికల సంఖ్య పెరిగింది. ఉత్తరాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్ గద్దె బాబూరావు, మాజీ మంత్రి పడాల అరుణ వంటి వారి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాయలసీమ, కోస్తాకు చెందిన చాలా మంది సీనియర్లు సైతం వీర్రాజుతో టచ్ లో ఉన్నారు. కానీ పార్టీ చేరికల విషయంలో రాష్ట్ర బీజేపీలో ఉన్న శక్తులు అడ్డుకుంటున్నాయి.
Somu Veerraju
సోము వీర్రాజుకు రాజకీయ మైలేజ్ రాకుండా ప్రయత్నిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడం చంద్రబాబు అనుకూల నేతలకు అవసరం. బీజేపీ ఒంటరి పోరు జగన్ అనుకూల నేతలు కోరుకుంటున్నారు. ఫలితంగా విరుద్ధ ప్రకటనలు చేస్తూ పార్టీలో గందరగోళం స్రుష్టిస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ఉంటే తమ పని కాదన్నట్టుగా భావిస్తున్నారు. అందుకే ఎప్పటికప్పుడు వీర్రాజును మారుస్తారని మీడియాకు లీకులందిస్తున్నారు. ప్రస్తుతం సోము వీర్రాజు విషయంలో పార్టీ అధిష్టానం క్లారిటీగా ఉంది. అందుకే ఆయన స్వేచ్ఛగా పనిచేస్తూ ముందుకు వెళ్లగలుగుతున్నారు. తన ముందున్న మార్గం పార్టీ బలోపేతమేనంటూ సోము వీర్రాజు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
Also Read:Twitter CEO Parag Agarwal: ట్విట్టర్ సీఈవో పరాగ్ పరిస్థితేంటి? ఎలన్ మస్క్ తొలగిస్తాడా? ఏం జరుగనుంది?
Web Title: Somu veerrajus perfect sketch to strengthen bjp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com