Rohit Sharma: టీమిండియాకు మరో షాక్ తగలనుంది. త్వరలో దక్షిణాఫ్రికాలో జరిగే మూడు టెస్టులు, మూడు వన్డేలకు జట్టును ఎంపిక జరిగింది. కానీ వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ కు దూరం అయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో అటు అభిమానులు ఇటు జట్టు మేనేజ్ మెంట్ ఆందోళనలో పడుతోంది. అంచనాలన్ని బలంగా ఉన్న తరుణంలో హిట్ మ్యాన్ రోహిత్ దూరం కావడం ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటివరకు దక్షిణాఫ్రికా గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గలేదు. దీంతో ఆ లోటును ఈసారైనా తీర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత జట్టుకు చేదు ఫలితమే కనిపిస్తోంది. దీంతో ఏం జరుగుతుందోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. డిసెంబర్ 16న భారతజట్టు ప్రత్యేక విమానంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ నెల 26 నుంచి ప్రారంభమయ్యే ఈ పర్యటనలో ఒమిక్రాన్ కారణంతో ఆటగాళ్లపై ఆంక్షలు కూడా కొనసాగే వీలున్నట్లు తెలుస్తోంది.
రోహిత్ శర్మ ముంబైలోని శరత్ పవార్ అకాడమీలో ఆదివారం ప్రాక్టీసు చేస్తున్న సందర్భంలో గాయపడినట్లు సమాచారం. ప్రాక్టీసు చేస్తున్నప్పుడు రఘు వేసిన ఓ బంతి గ్లౌస్ ను బలంగా తాకింది. దీంతో గాయమైంది. నొప్పితో విలవిలలాడాడు. ప్రాక్టీసు ముగించాడు. అయితే గాయంపై క్లారిటీ లేకపోయినా రోహిత్ మాత్రం మ్యాచ్ కు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులకు నిరాశే ఎదురవుతోంది.
Also Read: Virat kohli vs Rohit sharma: కోహ్లీని పక్కనపెట్టి రోహిత్ శర్మను కెప్టెన్ గా నియమించింది అందుకేనట?
వైస్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న రోహిత్ కు జట్టును గెలిపించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. దీంతో అతడు మ్యాచ్ కు దూరం కావడం పెద్ద లోటు అని తెలుస్తోంది. దీంతో మిగతా ఆటగాళ్లపై ప్రభావం పడే అవకాశముందని తెలుస్తోంది. కెరీర్ పరంగా రోహిత్ కు దెబ్బగానే కనిపిస్తోంది. మ్యాచ్ లో ఉంటే ఫలితం రాబట్టేందుకు అతడి సేవలు అవసరమని అంచనాలు పెరిగిపోయిన నేపథ్యంలో అతడు దూరం కావడం గమనార్హం.
Also Read: IND VS SA: గుర్రుగా ఉన్న కోహ్లీ.. జట్టుతో కలిసేనా?
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Rohit sharma ruled out of south africa test series with hamstring injury
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com