రాంగోపాల్ వర్మ అంటేనే సెన్సేషన్.. సెన్సేషన్ అంటే వర్మ. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ వర్మ. తను పట్టిన కోడికి నాలుగు కాళ్లు ఉంటాయంటాడు. ఎవరు ఏం వాదించినా లైట్‌గా తీసుకుంటాడు. వివాదస్పదమైన సినిమాలూ తీస్తుంటాడు. అదే స్థాయిలో రచ్చ చేసే ట్వీట్లూ చేస్తుంటాడు.
Also Read: హీరోయిన్ తో విడాకులు.. ఇంకా వెంటాడుతున్నాయి !
బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి పైనే అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. (ఇప్పుడు దర్యాప్తు కూడా అదే కోణంలో జరుగుతోందనుకోండి.) ఈ కేసులో రియా తప్పులేదంటే ముందు నుంచీ ఆమెకు అండగా నిలుస్తూ ట్వీట్లు చేస్తున్న వారిలో ముందు వరుసలో ఉంటారు వర్మ. ఈ కేసులో మీడియానే ట్రయల్స్ చేయడంపై అసంతృప్తిని కూడా వెలిబుచ్చాడు. ఈ విషయంపై బాలీవుడ్ హీరోలు స్పందించకపోవడంపై కూడా ఆర్జీవి తప్పుపట్టాడు. ఈ క్రమంలో మరోసారి వర్మ చేసిన ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి.
సుశాంత్ మరణంపై న్యాయం కావాలని కోరుతూ అమెరికాలో ప్రకటన బిల్ బోర్డుపై ‘Justice for Sushanth Singh Rajput’ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ బిల్ బోర్డును తొలగించడంపై రాంగోపాల్ వర్మ స్పందించాడు. ‘ఎట్టకేలకు ఈ కేసు విచారణ పారదర్శకతలో జరుగుతోంది. న్యాయం ఎప్పటికైనా నిలుస్తుందనే ఫీలింగ్ కలుగుతోంది. రియా చక్రవర్తికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి సంబంధించిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బిల్బోర్డును అమెరికాలో తొలగించారు’ అనే విషయాన్ని తన ట్వీట్లో పేర్కొన్నారు.
Also Read: సవతులుగా మారనున్న వరలక్ష్మీ శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్ !
ఇక సుశాంత్ సింగ్ కేసులో మీడియా అందరూ కలిసి రియా చక్రవర్తిని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా రియాకు మద్దతుగా నిలిచిన తాప్సీ, విద్యాబాలన్, శిభానీ దండేకర్, మంచు లక్ష్మీ, స్వరభాస్కర్ ధైర్యానికి మెచ్చుకోవాలని వర్మ అన్నారు. బాలీవుడ్ లో మగాళ్ల కంటే ఈ బాలీవుడ్ మహిళలకే ఎక్కువ మగతనం ఉందనే విషయాన్ని రుజువు చేశారని వర్మ ట్వీట్ చేశారు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More