Posani And RGV: ఏపీలో వైసిపి సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదవుతున్నాయి. కొందరి అరెస్ట్ కూడా జరిగింది. గత ఐదేళ్లుగా విపరీతమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు కొందరు. ఇప్పుడు వారందరినీ వెంటాడుతున్నారు ఏపీ పోలీసులు. వరుస పెట్టి కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసినపోసాని కృష్ణ మురళి,దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఏంటన్న ప్రశ్న వినిపిస్తోంది. రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. సమకాలీన రాజకీయ అంశాలపై సినిమాలు తీస్తూ వచ్చిన ఆర్జీవి జగన్ విషయంలో మాత్రం ప్రత్యేక అభిమానాన్ని కనబరుస్తూ వచ్చారు. గత ఐదేళ్లుగా చంద్రబాబుతో పాటు లోకేష్ లపై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడేవారు. పవన్ పై సైతం నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. మెగా బ్రదర్ నాగబాబును ఉద్దేశించిహాట్ కామెంట్స్ కొనసాగించారు.టిడిపి,జనసేనలను ద్వేషిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారు.మహిళల విషయంలో అసభ్యకరంగా మాట్లాడేవారు.వారితో అసభ్య వీడియోలు తీయించి సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్ట్ చేసేవారు.అటువంటి వ్యక్తిపై చర్యలు తీసుకోరా అని నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు పోసాని కృష్ణ మురళి ఏ రేంజ్ లో విరుచుకు పడేవారు అందరికీ తెలిసిందే. మెగాస్టార్ కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. వారి ఇంట్లో ఆడవారిని సైతం ప్రస్తావించి బూతులు తిట్టారు. అటువంటి వ్యక్తిపై ఇప్పుడు చర్యలు తీసుకోరా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు.
వైసిపి అలా వాడుకుంది
తాజాగా ఏపీవ్యాప్తంగా సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారందరిపై కేసులు నమోదవుతున్నాయి. అరెస్టులు కూడా జరుపుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సినీ రంగం నుంచి రావడంతో.. అదే రంగానికి చెందిన వారిని వైసిపి వాడుకుంది. వారితో అనేక రకాల ఆరోపణలు చేయించింది. ఏ చిన్న రాజకీయ అంశం అయినా వారితో మాట్లాడించే సరికి హైలెట్ అయింది. అప్పట్లో సోషల్ మీడియా విభాగం నుంచి వారికి భారీగాపారితోషికాలు వెళ్లేవని ప్రచారం సాగింది.అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రామ్ గోపాల్ వర్మ,పోసాని కృష్ణమురళి లాంటివారు సైలెంట్ అయ్యారు.కనీసం మీడియా ముందుకు రావడం లేదు. అయితే పోసాని మాత్రం ఇటీవల సాక్షిలో ఒక ప్రత్యేక కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. సినిమాలు తగ్గడం, వైసీపీకి పవర్ పోవడంతో ఆయనకు పని లేకుండా పోయింది. దీంతో సాక్షి కోసం ఇప్పుడు పనిచేయడం ప్రారంభించారు.
* పూర్తిగా సైలెంట్
రామ్ గోపాల్ వర్మ సైతం ఇప్పుడుసోషల్ మీడియాలో కనిపించకుండా మానేశారు.పూర్తిగా సైలెంట్ అయ్యారు.ఎటువంటి వ్యాఖ్యలు చేయడం లేదు. సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడడం లేదు. అసలు రాజకీయాల జోలికి పోవడం లేదు. అయితే ప్రస్తుతానికి సైలెంట్ అయ్యారు కానీ.. గత ఐదేళ్లుగా ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. సభ్య సమాజం తలదించుకునేలా ప్రత్యర్థులపై బూతులతోతమ విజ్ఞానాన్ని ప్రదర్శించేవారు.అయితే రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు నమోదవుతున్న నేపథ్యంలో.. వీరిద్దరిపై చర్యలు తీసుకోరా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: What about posani and rgv will there be an arrest
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com