https://oktelugu.com/

సరిలేరు మోడికెవ్వరు…!

ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి రాజ్యమేలుతుంది. చిన్న పెద్ద దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాలపై పెత్తనం చెలాయిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్ వంటి అగ్రరాజ్యాలు సైతం కరోనాని ఎలా కట్టడి చేయాలో తెలియక అయోమయంలో పడ్డాయి.సరిగ్గా ఇదే టైంలో కరోనా వైరస్ నియంత్రణ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించింది. దింతో మోడీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. భారత్ జనాభాతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 9, 2020 / 09:38 AM IST
    Follow us on

    ప్రపంచ వ్యాప్తంగా కరోనా రక్కసి రాజ్యమేలుతుంది. చిన్న పెద్ద దేశాలు అనే తేడా లేకుండా అన్ని దేశాలపై పెత్తనం చెలాయిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా, ఫ్రాన్స్, స్పెయిన్, ఇంగ్లండ్ వంటి అగ్రరాజ్యాలు సైతం కరోనాని ఎలా కట్టడి చేయాలో తెలియక అయోమయంలో పడ్డాయి.సరిగ్గా ఇదే టైంలో కరోనా వైరస్ నియంత్రణ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించింది. దింతో మోడీ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. భారత్ జనాభాతో పోల్చుకుంటే కరోనా తో ఇబ్బందులు పడుతున్న అగ్రరాజ్యాల జనాభా చాలా తక్కువ అయినా సరే భారత్ లో ఇప్పటి వరకు కరోనా ని నియంత్రించటం మామూలు విషయం ఏమి కాదు. మోడీ అనుసరిస్తున్న విధానాలే కారణమంటూ ప్రపంచ దేశాలు ప్రధాని ని ప్రశంసిస్తున్నాయి.

    ఈ క్రమంలోనే బ్రెజిల్ అధ్యక్షుడు ప్రధాని నరేంద్ర మోదీని సంక్షోభంలో సహాయం కోసం హానిమంతునిగా పోల్చారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ఫోన్ చేసి తమకు సాయం కావాలంటూ మాత్రల కోసం అభ్యర్థన చేశారు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా కలిగిన భారత్, కోవిడ్ 19ని సమర్థవంతంగా ఎదుర్కొంటుందనేది ప్రపంచంలో చాలా దేశాల మాట.

    ఈ పరిస్థితుల్లో తాజాగా బ్రెజిల్ భారత ప్రధాని నరేంద్ర మోడీని సంప్రదించారు. కరోనా రోగుల చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్వీన్ కావాలంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సనారో హనుమజయంతి రోజున ఓ లేఖ రాశారు. ఈ లేఖలో రామాయ‌ణ ప్ర‌స్తావ‌న తెచ్చారు. ల‌క్ష్మ‌ణుడిని కాపాడేందుకు హిమాల‌యాల నుంచి హ‌నుమంతుడు సంజీవిని తీసుకువ‌చ్చార‌న్నార‌న్నారు. ఆ రీతిలోనే మాకు హైడ్రాక్సీక్లోరోక్వీన్ మాత్ర‌ల‌ను ఇచ్చి మ‌మ్ముల్ని కాపాడాలంటూ బ్రెజిల్ అధ్య‌క్షుడు బొల్స‌నారో బుధవారం మోడీకి లేఖ రాశారు.

    ఈ సందర్భంగా బ్రెజిల్‌కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. మొత్తంమీద మందులేని కరోనా వైరస్‌ కు ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న హైడ్రాక్లీక్లోరోక్వీన్ ఓ దివ్యౌషధంగా మారింది. ఈ పరిణామాలన్నిటి నేపధ్యంలో #ModiLeadingTheWorld అంటూ సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ట్రెండ్ నడుస్తోంది. నెటిజన్లు దీన్ని ట్యాగ్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.