ఇవి మూయాలి, వీటిని తెరవాలి…!

తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న కారోన వైరస్ కేసుల వల్ల కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వరకు రాష్ట్రంలో ప్రజలు అత్యవసరం, నిత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏయే షాపులు తెరిచి ఉంచాలో, ఏయే దుకాణాలు మూసి ఉంచాలో… తెలంగాణ ఆరోగ్య శాఖ జాబితాను విడుదల చేసింది. తెరిచి ఉండేవి ఇవే.. మెడికల్ షాపులు కిరాణా దుకాణాలు కూరగాయలు, పాల దుకాణాలు ఫైర్ సర్వీసులు […]

Written By: Neelambaram, Updated On : March 23, 2020 6:20 pm
Follow us on

తెలంగాణలో రోజు రోజుకి పెరుగుతున్న కారోన వైరస్ కేసుల వల్ల కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 31వరకు రాష్ట్రంలో ప్రజలు అత్యవసరం, నిత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏయే షాపులు తెరిచి ఉంచాలో, ఏయే దుకాణాలు మూసి ఉంచాలో… తెలంగాణ ఆరోగ్య శాఖ జాబితాను విడుదల చేసింది.

తెరిచి ఉండేవి ఇవే..

మెడికల్ షాపులు
కిరాణా దుకాణాలు
కూరగాయలు, పాల దుకాణాలు
ఫైర్ సర్వీసులు
గ్యాస్ ఏజెన్సీలు
పెట్రోల్ బంకులు
సూపర్ మార్కెట్లు
చికెన్,మటన్,చేపల మార్కెట్లు

మూసి ఉండేవి ఇవే..

విద్యా సంస్థలు
బట్టల దుకాణాలు
టీ,టిఫిన్ సెంటర్లు
బంగారం, ఫ్యాన్సీ,టైలరింగ్ షాపులు
సెలూన్ షాపులు
ఎలక్ట్రికల్ దుకాణాలు
టాయ్స్ షాపులు