
కాంగ్రెస్ లో మల్కాజిగిరి ఎంపీ తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రస్థానం ముగియనున్నట్లు తెలుస్తుంది. ఆయన రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే సమాధానం వినబడుతోంది. రేవంత్ రెడ్డి మొదట్నుంచీ ‘హైలీ యాంబిషస్’ వ్యక్తి. ఎక్కడవున్నా తనకి ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకొనే వ్యక్తి. దానివలన వున్న పార్టీలోనే ఎక్కువమంది శత్రువుల్ని తయారుచేసుకుంటుంటాడు ఈ క్రమంలోనే గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ లో అసంతృప్తి ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ సీనియర్లకు చిరాగ్గా మారాయి. రేవంత్ రెడ్డి కి ఉన్న క్రేజ్ కాంగ్రెస్ లోఎవరికీ లేదని ఆయన అభిమానులు ఇతర సీనియర్ నేతలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఇబ్బందికర పరిణామం.
తెలంగాణ సీఎం కెసిఆర్ మీద రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా అవి ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదని, ఆయన ఫాలోయింగ్ కేవలం అభిమానమే కానీ ఓటు బ్యాంకు కాదని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు ఇప్పటికే అధిష్టానానికి చెప్పినట్లు సమాచారం. గురువారం కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా రేవంత్ విషయాన్ని ఆమెకు స్పష్టంగా చెప్పినట్లు సమాచారం. దీనితో రేవంత్ పై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహంగా ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతోనే ఈ విషయాన్ని ముందే గ్రహించిన రేవంత్ రెడ్డి పార్టీ నుంచి తప్పు తప్పుకునే భావన లో ఉన్నారట. తన రాజకీయ జీవితం తెరాస తో మొదలైనా ఎక్కువకాలం తెలుగుదేశం లో చంద్రబాబు నాయుడుకి అభిమానిగానే వున్నాడు. చివరకి కాంగ్రెస్ లో చేరేముందుకూడా చంద్రబాబుకి చెప్పే చేరాడనేది సమాచారం. త్వరలోనే ఆయన కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి, బీజేపీ గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయి.