https://oktelugu.com/

ఓహో… కిమ్ అదృశ్యానికి కారణం ఇదా!

గత నాలుగు నెలలుగా కరోనా వైరస్ వార్తలు, రెండు వారాలుగా కిమ్ జోంగ్ ఉన్ అదృశ్యం ప్రపంచ దేశాలలో చర్చనీయాంశంగా మారాయి. ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏప్రిల్ 15 నుంచి కనిపించకుండాపోయాడు. అప్పట్నుంచి ఈ వార్త ప్రపంచ దేశాలలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అదృశ్యం వెనుక అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా మరో ఆసక్తికర అప్‌ డేట్ బయటకి వచ్చింది. కరోనా వైరస్ భయాందోళనతోనే కిమ్ జోంగ్ ఉన్ బయటి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 28, 2020 / 07:28 PM IST
    Follow us on

    గత నాలుగు నెలలుగా కరోనా వైరస్ వార్తలు, రెండు వారాలుగా కిమ్ జోంగ్ ఉన్ అదృశ్యం ప్రపంచ దేశాలలో చర్చనీయాంశంగా మారాయి.
    ఉత్తర కొరియా అధ్యక్షుడు ఏప్రిల్ 15 నుంచి కనిపించకుండాపోయాడు. అప్పట్నుంచి ఈ వార్త ప్రపంచ దేశాలలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన అదృశ్యం వెనుక అనేక ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా మరో ఆసక్తికర అప్‌ డేట్ బయటకి వచ్చింది.

    కరోనా వైరస్ భయాందోళనతోనే కిమ్ జోంగ్ ఉన్ బయటి ప్రపంచానికి కనిపించకుండా అజ్ఞాతంలోకి వెళ్లి ఉండవచ్చునని ఉత్తర కొరియా వ్యవహారాలకు సంబంధించిన దక్షిణ కొరియా మంత్రి తాజాగా అభిప్రాయపడ్డారు. కిమ్‌ కి ఏదో అయిపోయిందని.. అతను మరణం అంచుల్లో ఉన్నాడని సర్వత్రా ప్రపంచం జరుగుతున్న వేళ.. అసలు ఉత్తర కొరియాలో అలాంటి ఛాయలేవి కనిపించట్లేదన్నారు. కిమ్‌ కి ఏదైనా జరిగితే కచ్చితంగా ఆ దేశంలో అసాధారణ పరిణామాలు చోటు చేసుకుని ఉండేవని.. కానీ అవేవీ కనిపించట్లేదని నొక్కి చెప్పారు.

    కరోనాకి భయపడే కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారన్న వార్తలపై కొరియా రిస్క్ గ్రూప్ సీఈవో కరోల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అదే నిజమైతే స్థానిక మీడియా నవ్వుల పాలవుతుందన్నారు. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన సమయంలో కిమ్ అజ్ఞాతంలోకి వెళ్లడం విమర్శలకు తావిస్తుందన్నారు. అంతేకాదు,ఒకవేళ కరోనా బారిన పడకుండా ఉండేందుకే కిమ్ రహస్య ప్రదేశంలో తలదాచుకుని ఉంటే.. ఆయన ఫోటోలు,వీడియోలు విడుదల చేయవచ్చు కదా అన్నారు. తద్వారా ఆయన అనారోగ్యంతో ఉన్నారన్న వార్తలకు చెక్ పెట్టవచ్చు కదా అని అభిప్రాయపడ్డారు.

    కిమ్ ఇలా కనిపించకపోవడం కూడా ఇదేమీ కొత్త కాదని ఉత్తర కొరియా విదేశీ వ్యవహారాలను పర్యవేక్షించే కిమ్ యోన్-చుల్ పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఆయన రెండుసార్లు దాదాపుగా 20 రోజుల పాటు కనిపించకుండా పోయారని చెప్పారు. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా వైరస్ కూడా నమోదు కాలేదన్న విషయంపై స్పందిస్తూ.. అక్కడ వైరస్ వ్యాప్తి నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారని చెప్పారు.