నిన్న దేశ వ్యాప్తంగా 168రైళ్లను రద్దుచేసిన రైల్వే శాఖ ఈ రోజు మరో కీలక నిర్ణయం తీసుకుంది. కారోన మహ్మరిని అరికట్టేందుకు బహిరంగ ప్రదేశాల్లో రద్దీని నివారించడానికి ఏప్రిల్ 15 వరకు ప్రయాణీకుల టిక్కెట్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రయాణికుల రిజర్వ్ చేసుకున్న టిక్కెట్లను రద్దు చేసి వారి నగదును డైరెక్టుగా వారి ఖాతాలో జమచేయనున్నట్లు.. ఈ సడలింపు 2020 మార్చి 21 నుండి ఏప్రిల్ 15 వరకు ప్రయాణ కాలానికి వర్తిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 90 శాతం రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
మార్చి 22 జనతా కర్ఫు నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన, అత్యవసర రైళ్ళు మినహాయించి దేశవ్యాప్తంగా 3700 రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు